Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ రిఎంట్రీ.. త్వరలో 5జి ఫోన్ లాంచ్..

కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్ 5జి సపోర్ట్, ఫిజికల్ కీబోర్డ్‌ ఉంటుంది వస్తుంది. పాత బ్లాక్‌బెర్రీ బ్రాండ్ లైసెన్స్‌దారు టిసిఎల్ కమ్యూనికేషన్ ఆగస్టు 31 నుంచి బ్లాక్‌బెర్రీ-బ్రాండెడ్ డివైజెస్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆరు నెలల తర్వాత ఈ కొత్త అభివృద్ధి జరిగింది. 

BlackBerry 5G Phone With Physical Keyboard Set to launch in 2021
Author
Hyderabad, First Published Aug 21, 2020, 2:43 PM IST

బ్లాక్ బెర్రీ బ్రాండ్ మరోసారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. అయితే టెక్సాస్ స్టార్టప్ ఆన్వర్డ్ మొబిలిటీ ప్రభుత్వ, సంస్థ వినియోగదారులకు భద్రతా పరిష్కారాలను నిర్మించడంలో అనుభవం ఉంది. కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్ 5జి సపోర్ట్, ఫిజికల్ కీబోర్డ్‌ ఉంటుంది వస్తుంది.

పాత బ్లాక్‌బెర్రీ బ్రాండ్ లైసెన్స్‌దారు టిసిఎల్ కమ్యూనికేషన్ ఆగస్టు 31 నుంచి బ్లాక్‌బెర్రీ-బ్రాండెడ్ డివైజెస్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆరు నెలల తర్వాత ఈ కొత్త అభివృద్ధి జరిగింది. ఆన్‌వర్డ్ మొబిలిటీ 2021 మొదటి అర్ధభాగంలో ఫిజికల్ కీబోర్డ్‌తో ఆండ్రాయిడ్ ఆధారంగా మొదటి 5జి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

ఈ ఫోన్ నార్త్ అమెరికా, ఐరోపాలో మొదట లాంచ్ చేయనుంది. అయితే తరువాత దశలో ఇతర మార్కెట్లకు కూడా అందుబాటులోకి వస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. కొత్త ఫోన్ ఫీచర్స్ “ఫీచర్-రిచ్ 5జి-రెడీ” మోడల్‌గా పేర్కొంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో పాటు భద్రతను కోరుకుంటున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. "బ్లాక్ బెర్రి స్మార్ట్ ఫోన్ కమ్యూనికేషన్స్, ప్రైవసి ఇంకా డేటాను రక్షించడానికి ప్రసిద్ది చెందాయి."అని ఆన్‌వర్డ్ మొబిలిటీ సి‌ఈ‌ఓ పీటర్ ఫ్రాంక్లిన్ అన్నారు.

also read “సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్” : మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ద్వారా లాంచ్.. ...

కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్ ప్రత్యేకతల గురించి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఏదేమైనా ఫ్రాంక్లిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది పునరూపకల్పన చేసీన "క్లీన్-షీట్ కీబోర్డ్" తో వస్తుందని చెప్పారు. ఈ ఫోన్‌కు దీర్ఘకాలిక సపోర్ట్ లభిస్తుందని కూడా హామీ ఇచ్చారు.

5జి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ధర కూడా మిడ్-రేంజ్ సమర్పణ కావచ్చు అని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ బ్రాండ్ తిరిగి రావడం ఇది మొదటిసారి కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణ తరువాత ఈ బ్రాండ్ గట్టి పోటిని ఎదుర్కొంది. చివరికి డిసెంబర్ 2016లో టిసిఎల్ కమ్యూనికేషన్‌తో లైసెన్సింగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

భారతదేశం, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి విక్రయించడానికి ఇది ఫిబ్రవరి 2017లో ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఫిబ్రవరిలో టిసిఎల్ కమ్యూనికేషన్ ఇకపై బ్లాక్‌బెర్రీ -బ్రాండెడ్ మొబైల్ పరికరాలను విక్రయించబోమని ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios