ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తో ఇతర ఇ-కామర్స్  సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్‌ ప్రారంభించాయి. బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా  స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్ లో ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులను ఇస్తోంది.

నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ నవంబర్ 27 నుండి 30 వరకు ప్రత్యక్షంగా ఉంటుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో వినియోగదారులు షియోమి ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ పొందువచ్చు.  

రియల్‌మీ 6ఐ, రియల్‌మీ 6, రియల్‌మీ ఎక్స్‌3 సూపర్‌జూమ్‌, ఎక్స్‌50 ప్రొలతో పాటు ఏ‌ఐ‌ఓ‌టి ఉత్పత్తులైన రియల్‌మీ ఎయిర్‌బడ్స్‌ క్లాసిక్‌, రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌, రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ నియో, రియల్‌మీ క్యామ్‌ 360 డిగ్రీలపై భారీ తగ్గింపును ప్రకటించినట్లు రియల్‌మీ పేర్కొంది.  

బ్లాక్ ఫ్రైడే సేల్ 2020: స్మార్ట్ ఫోన్స్ పై ఎప్పుడు లేని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..

also read ఫోన్ నంబర్లలో మార్పు.. మొబైల్ ఫోన్స్ కి కాల్స్ చేయాలంటే ‘0’ తప్పక డయల్ చేయాలీ : టెలికాం డిపార్ట్మెంట...

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి స్పెషల్‌ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి   6నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇస్తుంది.  గత  కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న   బ్లాక్‌ఫ్రైడే  సేల్ లో భాగంగా  ఆన్‌లైన్‌ , ఆఫ్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో   భారీ స్థాయిలో కొనుగోళ్లు నమోదవుతున్నాయి. 

భారతదేశంలో రెడ్‌మి 9ఐ ధర: సేల్ సమయంలో వినియోగదారులు ఈ రెడ్‌మి మొబైల్ 4 జిబి ర్యామ్ / 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ .8,299 (ఎంఆర్‌పి 9,999 రూపాయలు) కు కొనుగోలు చేయవచ్చు.

భారతదేశంలో రెడ్‌మి 8ఎ డ్యూయల్ ప్రైస్: రెడ్‌మి 8ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను సెల్‌లో రూ.9,999కు బదులుగా రూ.6,999 కు అమ్ముడవుతోంది. రెడ్‌మి బ్రాండ్‌కు చెందిన ఈ ఫోన్ పై 3వేల రూపాయల తగ్గింపుతో లభిస్తుంది.

భారతదేశంలో రెడ్‌మి 9 ప్రైమ్ ప్రైస్: కొంతకాలం క్రితం లాంచ్ అయిన రెడ్‌మి 9 ప్రైమ్ ధర కూడా తగ్గించింది. ఈ రెడ్‌మి మొబైల్‌కు చెందిన 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .13,999 కు బదులుగా రూ.10,999కు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌పై కూడా 3వేల  రూపాయల తగ్గింపు లభిస్తుంది.

భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ప్రో ధర: రెడ్‌మి నోట్9ప్రో స్మార్ట్‌ఫోన్ 4 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్ షియోమి సైట్‌లోబ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ .17,999కు బదులుగా రూ.14,999 కు కొనుగోలు చేయవచ్చు, అంటే ఈ ఫోన్‌పై రూ .3వేల తగ్గింపు లభిస్తుంది.