ప్రముఖ ఆడియో డివైజెస్ తయారీ సంస్థ స్కల్ క్యాండి కొత్త ఇయర్ బడ్స్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్కల్ క్యాండి స్పోక్ టి‌డబల్యూ‌ఎస్ ఇయర్‌బడ్‌లు వాటర్, డస్ట్‌ప్రూఫ్ కోసం ఐపిఎక్స్ 4 సర్టిఫైడ్ పొందాయి.

స్కల్ క్యాండి స్పోక్ ఇయర్ బడ్స్ బ్యాటరీ 14 గంటల బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్లిక్ ఛార్జింగ్ కేసుతో లభిస్తుంది. ఛార్జింగ్ కేసుకి ఎల్‌ఈ‌డి ఇండికేషన్ కూడా ఉంది.

ఈ ఇయర్ బడ్స్ కాల్స్, ప్లే/పాజ్ టచ్ కంట్రోల్ తో వస్తుంది. స్కల్ క్యాండి స్పోక్ ధర భారతదేశంలో 7,999 రూపాయలు, ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ నుండి కేవలం రూ .2,999 కు అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ బ్లాక్ కలర్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 

also read రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు.. ...

స్కల్ క్యాండి స్పోక్  టి‌డబల్యూ‌ఎస్ ఫీచర్లు 

ఇయర్ బడ్స్ బ్యాటరీ లైఫ్ ఛార్జింగ్ కేసుతో 14 గంటలు వస్తుంది, ప్రతి బడ్స్ బ్యాటరీ బ్యాకప్ నాలుగు గంటలు. వాల్యూమ్, వాయిస్ అసిస్టెంట్, మ్యూజిక్ కంట్రోల్, ఈక్వలైజర్ కోసం టచ్ కంట్రోల్స్ ఉన్నాయి.

ఈ బడ్స్ నాయిస్ ఐసోలేటింగ్ ఫిట్‌తో వస్తుంది. స్కల్ క్యాండి స్పోక్‌ ఇయర్ బడ్స్ పై రెండేళ్ల వారంటీని కూడా అందిస్తుంది. స్కల్ క్యాండి స్పోక్‌లో బ్లూటూత్ వి5, 8 ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి.  ఇయర్ బడ్స్  ఫ్రీక్వెన్సీ 20Hz వరకు ఉంటుంది.  ఇయర్ బడ్స్ బరువు 57 గ్రాములు.