ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ ఎల్‌టిఇ  ఐఫోన్ 12 అక్టోబర్‌లో లాంచ్ చేయాలని యోచిస్తుంది, 5జి మోడల్స్ నవంబర్‌లో రవాణా చేయనున్నారు. జపాన్ సైట్ లో ఒక కొత్త నివేదిక ప్రకారం చైనా సప్లయ్ చైన్  కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ఐఫోన్ 12ను లాంచ్ కి అంతారం ఏర్పడింది అని తెలిపింది.  

ఆపిల్ ఇన్సైడర్ జోన్ ప్రాసెసర్ ఐఫోన్ 12 లాంచ్ ఈవెంట్ ఎక్కువ మంది వ్యక్తిగతంగా హాజరుకావడానికి అవకాశం ఉందని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వివిధ మార్కెట్లలో మూసివేసిన ఆపిల్ స్టోర్లు అన్నీ తిరిగి తెరవనుంది.

also read ఫ్లిప్‌కార్ట్ చేతికి వాల్‌మార్ట్.. ఆగస్టు నుంచి హోల్‌సేల్‌ బిజినెస్ ప్రారంభం... ...

రెండు ప్రీమియం వేరియంట్‌లతో సహ ఐఫోన్ 12 సిరీస్ కింద ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌లను విడుదల చేయనుంది. ఐఫోన్ 12 ప్రో 6.1-అంగుళాల లేదా 6.7-అంగుళాల సైజుతో వస్తుంది.

ప్రస్తుతం ఐప్యాడ్ ప్రోలో కనిపించే విధంగా అధిక రిఫ్రెష్-రేట్ 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంటుంది. డివైజ్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఇటీవల ప్రారంభించిన ఆపిల్ ఐప్యాడ్ ప్రోలో ప్రవేశపెట్టిన లిడార్ స్కానర్‌తో నాలుగు సెన్సార్ల  ఉంటాయి.

ప్రఖ్యాత ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో గతంలో పేర్కొన్నట్లుగా, నాలుగు ఐఫోన్ మోడళ్లలో ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే, 5జి‌ సపోర్ట్ ఉంటుంది.