Asianet News TeluguAsianet News Telugu

చైనాకు గట్టి షాకిచ్చిన ఆపిల్.. ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ బ్యాన్..

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆపిల్ గేమ్ పబ్లిషర్స్ కి  ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబర్‌ను సమర్పించడానికి జూన్ చివరి వరకు గడువు ఇచ్చింది. అప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ యాప్స్ అన్నింటిని యాపిల్ తన ప్లే స్టోర్ నుంచి తొలిగించింది. 

Apple Removes Thousands of Game Apps From its app Store: Research Firm
Author
Hyderabad, First Published Aug 7, 2020, 12:54 PM IST

రీసెర్చ్ సంస్థ కిమై నుండి వచ్చిన సమాచారం ప్రకారం ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ యాప్ స్టోర్ నుండి 26,000 గేమ్స్ తో మొత్తం సహా 29,800 యాప్స్ ని శనివారం తొలగించింది. ఇందులో లైసెన్స్ లేని గేమ్ యాప్స్ ఎక్కువగా ఉన్నట్లు  అధికారులు తొలగించారు. ఆపిల్ వెంటనే దీనిపై స్పందించలేదు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆపిల్ గేమ్ పబ్లిషర్స్ కి  ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబర్‌ను సమర్పించడానికి జూన్ చివరి వరకు గడువు ఇచ్చింది. అప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ యాప్స్ అన్నింటిని యాపిల్ తన ప్లే స్టోర్ నుంచి తొలిగించింది.

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ చాలాకాలంగా ఈ  నిబంధనలను పాటించాయి. ఈ సంవత్సరం ఆపిల్ వాటిని ఎందుకు ఖచ్చితంగా అమలు చేస్తోందో స్పష్టంగా తెలిదు. స్మార్ట్ ఫోన్ తయారీదారు  ఆపిల్ జూలై మొదటి వారంలో 2,500కి పైగా  యాప్స్ తన యాప్ స్టోర్ నుండి తొలగించింది.

also read మ్యూజిక్ లవర్స్ కి షాక్.. అక్టోబర్‌ నుండి గూగుల్ ప్లే మ్యూజిక్ పనిచేయదు.. ...

ప్రభావితమైన గేమ్స్ లో జింగా, సూపర్ సెల్ ఉన్నాయి అని పరిశోధనా సంస్థ సెన్సార్ టవర్ నివేదించింది. సున్నితమైన కంటెంట్‌ను తొలగించడానికి చైనా ప్రభుత్వం గేమింగ్ పరిశ్రమపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.

"ఇది చిన్న, మధ్య తరహా డెవలపర్‌ల ఆదాయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, కానీ వ్యాపార లైసెన్స్‌ను పొందడంలో ఇబ్బందులు ఉన్నందున, చైనాలోని మొత్తం ఐ‌ఓ‌ఎస్ గేమ్ పరిశ్రమకు కోలుకొని దెబ్బ" అని చైనా ఆపిల్ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ టాడ్ కుహ్న్ అన్నారు.  

భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై బ్యాన్ విధించిన సంగతి విదితమే. త్వరలోనే మరికొన్ని యాప్‌లను నిషేదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా టిక్ టాక్‌తో పలు చైనా యాప్‌లను బ్యాన్ చేయడానికి సిద్ధమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios