వాషింగ్టన్: కొత్త కొత్త ఆలోచనలతో ప్రయోగాలను చేయడంలో ఆపిల్ సంస్థ ముందుంటుంది. తాజాగా ఒక కొత్త అలచనతో యాపిల్ డెవలపర్స్ ముందుకొచ్చారు. అదేంటంటే  సాధారణంగా కారు డోర్ తీయడానికి తాళం కోసం వెతుకుతుంటాం అయితే దానికి బదులు ఐఫోన్ వాడితే ఎలా ఉంటుంది? సరిగ్గా దీనిపైనే యాపిల్ డెవలపర్స్ దృష్టి పెట్టారు.

ఆపిల్ సంస్థ వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యుడిసి) లో సోమవారం ఒక కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. దీని ద్వారా కారు డ్రైవర్లు ఐఫోన్‌ ద్వారా కారును  అన్‌లాక్ చేయడానికి ఇంకా కారును స్టార్ట్ చేయవచ్చు అని తెలిపింది.

 కార్ ఎక్స్ పిరిఎన్స్ ఇంజనీరింగ్, ఆపిల్ సీనియర్ మేనేజర్ ఎమిలీ షుబెర్ట్ కారును అన్‌లాక్ చేయడానికి డ్రైవర్ తన ఐఫోన్‌తో డోర్ హ్యాండిల్‌ ఎలా ఆన్ లాక్ చేయాలో చూపించాడు. అలాగే డ్రైవర్లు కారు ఛార్జింగ్ ప్యాడ్‌లో ఐఫోన్‌ను ఉంచి కారు స్టార్ట్ ఇగ్నిషన్ బటన్‌ను నొక్కి ఎలా స్టార్ట్ చేయాలో కూడా చూపించాడు.

also read ‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్‌’కు గట్టి చాలెంజ్ ...

ఆపిల్ టెక్నాలజీ "నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ "(ఎన్‌ఎఫ్‌సి) అని పిలువబడే దానిపై ఇది ఆధారపడుతుంది, ఇది ఒకదానికొకటి కొన్ని సెంటీమీటర్ల పరిధిలో ఉన్న డివైజెస్ ను  వైర్‌లెస్ డేటాను ట్రాన్సఫర్ చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఆపిల్ అల్ట్రా వైడ్‌బ్యాండ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించుకొవాలని యోచిస్తోంది. దీనివల్ల ఇది ఎక్కువ దూరం నుండి కూడా కార్ అన్‌లాక్ చేయడానికి సహాయపడుతుంది. దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి కూడా ఫోన్ ను చూపితే డోర్ తెరుచుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కారులోని ఆపిల్ ఐ‌ఓ‌ఎస్14, ప్రస్తుత వెర్షన్ ఐ‌ఓ‌ఎస్  13కి సపోర్ట్ ఇస్తుంది. ఈ సంస్థ మొదట 2021 బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌లో ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది, అయితే దీనిని ఇతర కార్ మోడళ్లకు  కూడా భవిష్యత్తులో ప్రవేశపెట్టలని చూస్తుంది.