ఐఫోన్ 12 సిరీస్.. ‘మేడ్ ఇన్ ఇండియా’తో విడుదల చేయనున్న ఆపిల్..
ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఆపిల్ స్థానికంగా తయారైన ఐఫోన్ 12ను 2021 మధ్యలో విడుదల చేయాలని చూస్తోంది. ఐఫోన్ 12 భారతదేశంలో తయారయ్యే ఏడవ మోడల్‌గా ఉంటుందని కొన్ని వర్గాల సమాచారం.
కుపెర్టినో దిగ్గజం ఆపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్-12 తయారీని ప్రారంభించాలని యోచిస్తోంది. ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఆపిల్ స్థానికంగా తయారైన ఐఫోన్ 12ను 2021 మధ్యలో విడుదల చేయాలని చూస్తోంది.
ఐఫోన్ 12 భారతదేశంలో తయారయ్యే ఏడవ మోడల్‌గా ఉంటుందని కొన్ని వర్గాల సమాచారం. ఐఫోన్ ఎస్‌ఈ 2020 కూడా ఈ ఏడాది చివరి నాటికి స్థానికంగా తయారవుతుందని పేర్కొంది. ఐఫోన్ 12ను కర్ణాటకలోని విన్స్ట్రాన్ బెంగళూరుకు సమీపంలోని నరసాపుర ప్లాంట్ వద్ద తయారు చేయనున్నారు.
ఆపిల్ ఇప్పటికే దేశంలో ఐదు ఐఫోన్ మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 11 తయారీని యాపిల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఐఫోన్ 11 మేక్ ఇన్ ఇండియా బ్యాడ్జ్ పొందుతుంది.
also read 5జి సపోర్టుతో రియల్‌మి ఎక్స్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్.. ఎప్పుడంటే ? ...
ఉత్పత్తి ప్రక్రియను మరింత విస్తరించెందుకు దశలవారీగా విస్ట్రాన్ 10వేల మంది కార్మికులను నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఉత్పత్తి ప్లాంట్లో సుమారు 1,000 మంది కార్మికులు ఉన్నారు.
విన్‌స్ట్రాన్ బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిశ్రమల వాణిజ్య విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా "నియామక ప్రక్రియ ప్రారంభమైనందుకు మేము సంతోషంగా ఉన్నాము, త్వరలో ఉత్పత్తిని కూడా ప్రారంభించబోతున్నాము" అని పేర్కొన్నారు.
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన మరో సీనియర్ అధికారి కంపెనీ దశలవారీగా కొత్త వారిని నియమించుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఐటిఐ, డిప్లొమా గ్రాడ్యుయేట్ల కోసం కోలార్‌లోని కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన వ్యక్తులతో సహా మరిన్ని నియామకాలు త్వరలో జరుగుతాయని భావిస్తున్నారు. సంస్థ ఇప్పటికే ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది.