ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ? ధర, ఫీచర్స్ వివరాలు మీకోసం..
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఐఫోన్ 12 సిరీస్ కాస్త ఆలస్యం అయిన అక్టోబర్ 13న డిజిటల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆపిల్ వర్చువల్ ఈవెంట్ ద్వారా ఐఫోన్ 12 సిరీస్ ని ఆవిష్కరించనుంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ పై ప్రకటన వెల్లడైంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఐఫోన్ 12 సిరీస్ కాస్త ఆలస్యం అయిన అక్టోబర్ 13న డిజిటల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది.
ఆపిల్ వర్చువల్ ఈవెంట్ ద్వారా ఐఫోన్ 12 సిరీస్ ని ఆవిష్కరించనుంది. అయితే కంపెనీ గత నెలలో ఐప్యాడ్ ఎయిర్, ఆపిల్ వాచ్ సిరీస్ 6ని విడుదల చేసింది.
ఆపిల్ ఈవెంట్
మంగళవారం కొన్ని మీడియా సంస్థాలకు పంపిన వర్చువల్ ఈవెంట్ ఇన్విటేషన్ లో కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ అక్టోబర్ 13 న ఉదయం 10 గంటలకు అంటే భారత సమయం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుందని తేలీపింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఐఫోన్ 12 అక్టోబర్ 23 న సెలెక్టెడ్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
also read పెరిగిపోతున్న సెక్స్‌టింగ్: జాగ్రత్త లేదంటే మీ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యే ఛాన్స్ .. ! ...
ఆపిల్ ఐఫోన్ 12 ధర, వేరియంట్లు, ఫీచర్లు
రాబోయే ఐఫోన్ 12 ధర 699 నుండి 749 యూఎస్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా, ఐఫోన్ 12 మాక్స్ ధర 799-849 యూ.ఎస్ డాలర్లు ఉంటుందని తేలింది. ఐఫోన్ 12 ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల ధర 1,100 డాలర్ల నుండి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
ఆపిల్ ఐఫోన్ 12 నాలుగు మోడళ్లను విడుదల చేస్తుంది. 5.4-అంగుళాలతో ఐఫోన్ 12 మినీ, 6.1-అంగుళాలతో ఐఫోన్ 12, 6.1-అంగుళాల ఐఫోన్ 12 ప్రో, 6.7-అంగుళాలతో ఐఫోన్ 12 ప్రో మాక్స్. ఐప్యాడ్ ప్రోలో కనిపించే విధంగా ఐఫోన్ 12 ప్రో అధిక రిఫ్రెష్-రేట్ 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్‌ప్లే దీనికి ఉంటుంది.
మొత్తం నాలుగు ఐఫోన్ మోడళ్లలో ఓఎల్‌ఇడి డిస్‌ప్లేలు, 5జి సపోర్ట్ ఉంటుందని విదేశీ విశ్లేషకులు తెలిపారు. ఎంట్రీ లెవల్ ఐఫోన్ 12 బ్లాక్ , వైట్, బ్లూ, రెడ్, యెల్లో సహా మొత్తం ఆరు రంగులలో 64 జిబి స్టోరేజ్ తో రావచ్చు అని భావిస్తున్నారు.