టెక్నాలజి దిగ్గజం, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఇంక్ ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతుంది. ఏ‌పి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో ఆపిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయనున్నట్లు సమాచారం.

దీని ద్వారా 50వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆపిల్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమల మంత్రి మేకపతి గౌతమ్ రెడ్డి తెలియజేశారు.

also read పబ్-జి గేమర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో నిషేధం ఎత్తివేసే అవకాశం ? ...

ఆపిల్ కంపెనీకి చైనాలో ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్కడి ప్రతి తయారీ యూనిట్‌లో 1 లక్ష నుంచి 6 లక్షల మందికి  ఉపాధి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత భారీ ప్రాజెక్టు స్థాపించడానికి వారిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంస్థతో బలమైన చర్చలు జరుపుతోంది అని అన్నారు.

ఈ ప్రాజెక్టు పెట్టుబడి, వివరాల గురించి రాబోయే రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అయితే ప్రాజెక్టు స్థాపించడానికి అన్ని అనుమతులను సమయానుసారంగా ఇస్తామని, కంపెనీలను స్థాపించి ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని మంత్రి కోరారు.