మీరు ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా, ఈ దీపావళి ఫెస్టివల్ కంటే మంచి సమయం మరొకటి లేదు. ఎందుకంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్  రూ.50వేల లోపు లభిస్తుందని ప్రకటించినట్లే, కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశం అంతటా ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.

ఆపిల్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ స్టోర్ లేదా ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ నుండి ఐఫోన్ 11 తో కొంటె ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ లిమిటెడ్ పిరియడ్  ఆఫర్ అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుంది.

ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ఆన్‌లైన్ ఆపిల్ స్టోర్‌లో రూ.68,300లకే లభిస్తుంది. ఎయిర్‌పాడ్‌లు ధర రూ.14,990. ఆపిల్ అందించే ఉచిత ఎయిర్‌పాడ్స్ ఆఫర్‌తో ఐఫోన్ 11 ధర కేవలం  రూ.53,310కే  లభిస్తుంది.

also read మీరు స్టూడెంట్ అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి నెలకు 22,500 సంపాదించవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

ఆపిల్ ఐఫోన్ 11 లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 64 జిబి మరొకటి 128 జిబి. 64 జీబీ వేరియంట్ రూ .61,999 కు లభిస్తుండగా, 128 జీబీ వేరియంట్ రూ .67,990కు లభిస్తాయి. ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ .13,499కు లభిస్తాయి.

వాల్ మార్ట్ యజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్ 16-21 వరకు వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్‌ నిర్వహిస్తుంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఎయిర్‌పాడ్‌లు రూ .14,990 ధరకు లభిస్తుండగా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్న వేరియంట్‌కు రూ.18,900 లభిస్తుంది.

ఎయిర్‌పాడ్స్ ప్రో కోసం రూ.24,900 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆపిల్ వినియోగదారులకు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆపిల్ ఉత్పత్తులపై డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే త్వరపడండి.