ముంబై: స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్ ఇంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం 2 ట్రిలియన్ డాలర్లను దాటింది. కంపెనీ విలువ ఇటలీ, బ్రెజిల్, కెనడా రష్యాతో సహా అనేక దేశాల జిడిపి కంటే పెరిగింది. కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో సంస్థ షేర్లు బుధవారం 468.65 డాలర్లకు చేరింది.

దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.004 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. వెరసి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణ కొరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేషియా, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా వంటి దేశాల జిడిపిని అధిగమించింది.

ఇంకా పోల్చుకుంటే  టర్కీ, స్విట్జర్లాండ్, తైవాన్, యుఎఇ, నార్వే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ అయిన ఆపిల్ తన వాటాలను మార్చి కనిష్టానికి కంటే రెట్టింపు చూసింది. అమెజాన్.కామ్ ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్ప్ ఆపిల్ తరువాత రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి.

also read జియోఫోన్ వాడేవారికి గుడ్ న్యూస్.. ఆన్ లైన్ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్.. ...

ఆగష్టు 2018లో 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను చేరుకున్న మొదటి యుఎస్ కంపెనీ కూడా ఆపిల్. కోవిడ్ -19 మహమ్మారి, రాబోయే 5జి ఐఫోన్‌పై ఆశావాదం ఉన్నప్పటికీ 2020లో ఈ స్టాక్ ఇప్పటివరకు 57 శాతం పెరిగింది.

గత సంవత్సరంలో షేర్లు 120 శాతానికి పైగా పెరిగాయి. గత నెలలో ఐఫోన్ తయారీదారి కోవిడ్ -19 మహమ్మారి లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రోం హోం,ఆన్ లైన్ క్లాసుల వల్ల వినియోగదారులు దాని ఉత్పత్తులు, సేవలకు మారినందున ఆదాయ లాభాలను నివేదించినట్లు రాయిటర్స్ నివేదించింది.

2 ట్రిలియన్ డాలర్లను తాకిన మొదటి సంస్థ ఆపిల్ ఒక్కటే కాదు. దానికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ అరాంకో 2019 డిసెంబర్ స్టాక్ అరంగేట్రంలో 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది, కాని తరువాత ప్రపంచ ఆర్థిక మందగమనం, చమురు ధరల క్షీణత తరువాత పడిపోయేలా చేసింది.