Asianet News TeluguAsianet News Telugu

జూన్ 2021 వరకు ఆపిల్ సిబ్బంది కార్యాలయానికి తిరిగి రాకపోవచ్చు: ఆపిల్ సీఈఓ

జూన్ 2021 నాటికి చాలా వరకు ఉద్యోగులు ఆఫీసుకు తిరిగి రాకపోవచ్చు, చారిత్రాత్మకంగా కార్యాలయ-కేంద్రీకృత సంస్కృతిని కలిగి ఆపిల్ ఈ సంవత్సరం కంపెనీ విజయంతో భవిష్యత్తులో రిమోట్గా పనిచేయడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది అని అన్నారు.
 

Apple CEO Tim Cook Says Most Staff Wont Return to Office Until June 2021
Author
Hyderabad, First Published Dec 11, 2020, 1:13 PM IST

టెక్నాలజీ దిగ్గజం కుపెర్టినో సంస్థ ఆపిల్.ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ గురువారం ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులు ఆఫీసుకి తిరిగి రావాలన్న ప్రణాళికపై కొత్త వివరాలను వెల్లడించారు.

జూన్ 2021 నాటికి చాలా వరకు ఉద్యోగులు ఆఫీసుకు తిరిగి రాకపోవచ్చు, చారిత్రాత్మకంగా కార్యాలయ-కేంద్రీకృత సంస్కృతిని కలిగి ఆపిల్ ఈ సంవత్సరం కంపెనీ విజయంతో భవిష్యత్తులో రిమోట్గా పనిచేయడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది అని అన్నారు.

"ఫేస్ టు ఫేస్ సహకారానికి ప్రత్యామ్నాయం లేదు, కానీ ఉత్పాదకత లేదా ఫలితాలను తగ్గకుండా కార్యాలయం వెలుపల పనిని ఎలా చేయవచ్చనే దాని గురించి కూడా మనము చాలా నేర్చుకున్నాము" అని సిబ్బందితో అన్నారు . 

గతకొంత కాలంగా కరోనా సవాళ్ల కారణంగా ఆపిల్ అనేక ప్రాంతాల్లోని ఉద్యోగులకు జనవరి 4న అదనపు పేడ్ హాలిడేస్ ఇవ్వనుందని టిమ్ కుక్ తెలిపారు. ఆల్ఫాబెట్ గూగుల్‌తో సహా ఇతర కంపెనీలు కూడా సిబ్బందికి అదనపు పేడ్ డేను ఇచ్చాయి.

ఆపిల్ ఉద్యోగుల విరాళం కార్యక్రమం ఇప్పటివరకు దాని బలమైన సంవత్సరాన్ని కలిగి ఉంది అని గుర్తించారు. ఇది ప్రారంభమైనప్పటి నుండి,  సుమారు రూ. 4,300 కోట్లు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది, అలాగే ఉద్యోగులు స్వచ్ఛందంగా 1.6 మిలియన్ గంటలకు పైగా వాలంటీర్ చేశారు.

also read అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్ తో ఆపిల్ మొట్టమొదటి వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌.. డిసెంబర్ 15 నుండి అందుబాటులోక...

. కోవిడ్-19 వల్ల బాధపడుతున్న వారికి సహాయపడే సంస్థలకు కంపెనీ సుమారు రూ. 36 కోట్లు విరాళం ఇస్తున్నట్లు కుక్ చెప్పారు.

టౌన్ హాల్ సమావేశంలో రిటైల్, లీగల్, ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్, సర్వీసెస్, హార్డ్ వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖులతో సహా పలువురు ఆపిల్ అధికారులు మాట్లాడారు.

హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాన్ రిసియో మాట్లాడుతూ సాధారణంగా ల్యాబ్ లలో చేసే డివైజ్ డిజైన్ ను రిమోట్ వర్క్‌   చేయడం చాలా కష్టమైనది. మార్చిలో విధించిన ప్రయాణ పరిమితులు చాలా కఠినమైనవి, ఎందుకంటే ఇంజనీర్లు సాధారణంగా చైనాకు ఉత్పత్తుల తయారీని ప్రారంభించటానికి వెళ్తుంటారు.

 ఇంజనీర్లు ఇంటి నుండి రోబోట్లను కంట్రోల్ చేస్తూ, విదేశీ కర్మాగారాల్లోని సాంకేతిక నిపుణులకు మార్గనిర్దేశం చేయడానికి ఆగ్మెంటెడ్-రియాలిటీ సాఫ్ట్‌వేర్‌తో ఐప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు, ఇప్పటికే చైనాలో ఉన్న సిబ్బందితో కమ్యూనికేట్ చేయడానికి సిబ్బంది వేర్వేరు గంటలు పనిచేస్తున్నారు  అని డాన్ రిసియో అన్నారు.

రాబోయే సంవత్సరాల్లో తొలిసారిగా ఆగ్మెంటెడ్-రియాలిటీ, వర్చువల్-రియాలిటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారించిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

కస్టమ్ చిప్ డెవలప్‌మెంట్ హెడ్ జానీ స్రౌజీ ఈ సంవత్సరం అభివృద్ధిలో ఉన్న సెల్యులార్ మోడెమ్ గురించి సిబ్బందికి తెలిపారు.

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ మాట్లాడుతూ ఆపిల్ డిజైన్ బృందం రిమోట్గా పని చేసే కొత్త మార్గాలను కనుగొంది. ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ సబీ ఖాన్ ఈ సంవత్సరం ఉత్పత్తులను తక్కువ జాప్యంతో ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ప్రశంసించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios