ఈ కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్-డివైజెస్ లైనప్‌లో స్మార్ట్ ప్లగ్ అనే కొత్త ఉత్పత్తిని భారతదేశంలో విడుదల చేసింది. స్మార్ట్ ప్లగ్ భారత మార్కెట్ కోసం రూపొందించారు. ఈ స్మార్ట్-డివైస్ 3-పిన్ సాకెట్ డిజైన్‌ తో వస్తుంది. 6A పవర్ రేటింగ్, స్టేట్ రిటెన్షన్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది.

వాయిస్‌ కమాండ్స్ ద్వారా ఇంట్లో ఉండే ఎలక్త్రోనిక్ అప్లయెన్సెస్‌ను కంట్రోల్‌ చేయడంలో ఈ  ప్లగ్‌ ఉపయోగపడనుంది.  ఇది  విద్యుత్తు అంతరాయాల సమయంలో  సమర్థంగా నిర్వహించగలదని అమెజాన్‌ తెలిపింది.   

అమెజాన్ స్మార్ట్ ప్లగ్: ధర, లభ్యత, ఆఫర్
అమెజాన్ స్మార్ట్ ప్లగ్ ధర భారతదేశంలో 1,999 రూపాయలు ఇప్పుడు అమెజాన్ ఇండియాలో అలాగే ఎంపిక చేసిన క్రోమా, రిలయన్స్ డిజిటల్ అవుట్లెట్లలో కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఎకో డాట్‌తో అమెజాన్ స్మార్ట్ ప్లగ్‌ను కేవలం 999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

also read షియోమి ఎం‌ఐ మొట్టమొదటి వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌ వచ్చేసింది.. ...

అమెజాన్ స్మార్ట్ ప్లగ్:  ఏమి చేస్తుంది?
హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ కోసం స్మార్ట్ ప్లగ్‌ను అనుకూలమైన అలెక్సా డివైజ్ తో(ఎకో స్మార్ట్ స్పీకర్లు వంటివి) జత చేయడం ద్వారా అమెజాన్ స్మార్ట్ ప్లగ్ లైట్ టీవీ లేదా ఫ్యాన్ వంటి మీ ప్రస్తుత డివైజెస్ ని స్మార్ట్ గా కంట్రోల్ చేస్తుంది.

మీరు ఉదయం లేదా రాత్రి సమయాల్లో లైట్లను ఆపివేయడానికి టైమ్ షెడ్యూల్ చేయవచ్చు లేదా ఒక నిర్దిష్ట సమయంలో వంటగదిలో విద్యుత్ కేటిల్ ఆన్ చేయండి వంటివి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.

అలా చేయడానికి మీ అలెక్సా యాప్ లో సెట్టింగ్‌లకు వెళ్లి రొటీన్ ఆప్షన్ ఎంచుకోండి. అలెక్సా డైలీ షెడ్యూల్ సెటప్ చేయడానికి అందులో చూపించే విధంగా అనుసరించండి.

అమెజాన్ స్మార్ట్ ప్లగ్: దీన్ని ఎలా సెటప్ చేయాలి?
స్మార్ట్ ప్లగ్ ను సెటప్ చేయడానికి అలెక్సా యాప్ ఉపయోగించి అమెజాన్ స్మార్ట్ ప్లగ్ ఎలక్ట్రికల్ సాకెట్ లోకి ప్లగ్ చేయండి (ఐ‌ఓ‌ఎస్, ఆండ్రోయిడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది). కనెక్ట్ అయిన తర్వాత మీరు పవర్ ఆన్ / ఆఫ్ చేయడానికి ఏదైనా ఎకో సిస్టం, ఫైర్ టివి లేదా అలెక్సా ఇంటర్నల్ డివైజ్ కంట్రోల్ చేయవచ్చు.