అమెజాన్ ఇండియా ప్రైమ్ డే 2020 సెల్  షెడ్యూల్‌ను మైక్రోసైట్ ద్వారా ప్రకటించింది. యుఎస్ ఇ-కామర్స్ దిగ్గజం ఈ సంవత్సరం వార్షిక సేల్స్ కార్యక్రమం ఆగస్టు 6 నుండి ఆగస్టు 7 వరకు జరుపనుంది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్  సధారణంగా జూలై షెడ్యూల్ స్థానంలో ఆగస్టులో ప్రవేశపెట్టడం ఇవ్వడం ఇదే మొదటిసారి.

ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ సెల్  ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా భారతదేశంలో నాల్గవ ప్రైమ్ డే సేల్స్ అవుతుంది. గ్రేట్ డీల్స్, కొత్త లాంచ్‌లను తీసుకురావడానికి ఈ సేల్స్ ఉపయోగపడుతుంది. ప్రైమ్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా అమెజాన్  ప్రైమ్ చందాదారులను లక్ష్యంగా చేసుకున్న వార్షిక సేల్స్ కార్యక్రమం.

సంస్థ సాధారణంగా ఈవెంట్‌ను ప్రకటించడంతో పాటు కొన్ని హాట్  డీల్స్ వెల్లడిస్తుంది. అయితే, ఈసారి, ప్రైమ్ డే 2020 మైక్రోసైట్‌లో జూలై 23 నుంచి కొన్ని ఆఫర్లు వెల్లడవుతాయని పేర్కొంది.

అమెజాన్ ప్రైమ్ డే 2020 డీల్స్ , ఆఫర్లు

 ఆగస్టు 6న అర్ధరాత్రి 12 గంటలకు  ప్రారంభమవుతుంది.  స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీలు, కిచెన్, డైలీ ఎసెన్షియల్స్, బొమ్మలు, ఫ్యాషన్, బ్యూటీ, ఇతర విభాగాలలో ఉత్తమ డీల్స్  ఉంటాయని అమెజాన్ తెలిపింది.

also read ఐటి, బిపిఓ కంపెనీల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రోం హోం పొడిగింపు.. ...

కంపెనీ ఎకో, ఫైర్ టివి, కిండల్ పరికరాల్లో “అత్యుత్తమమైన డీల్స్” ఉంబోతున్నట్లు సూచించింది. ఇంకా శామ్‌సంగ్, జాబ్రా, టైటాన్, జెబిఎల్, వన్‌ప్లస్, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్, షియోమిలతో సహా పలు బ్రాండ్ల నుండి 300కి పైగా కొత్త ఉత్పత్తులు లాంచ్‌లో ఉంటాయి.  

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా మీరు వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై ఆసక్తికరమైన డీల్స్ చూడవచ్చు. వివిధ ఉత్పత్తులపై  హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు కూడా ఉంటుంది. ఇంకా రెండు రోజుల సేల్స్ ఈవెంట్ లో ఖర్చు లేని ఈ‌ఎం‌ఐ  ఆప్షన్, ఎక్స్ఛేంజి ఆఫర్లను కూడా  అందిస్తుంది.
    
అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ ద్వారా ప్రైమ్ యూసర్లను అలరించడానికి అనేక ఉత్పత్తులపై  డీల్స్ తో పాటు, అమెజాన్  ప్రైమ్ డే సేల్ ఈవెంట్ సందర్భంగా కొత్త సినిమా కూడా విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం మీరు సేల్స్ కార్యక్రమానికి ముందు బర్డ్స్ ఆఫ్ ప్రే, శకుంతల దేవి, జెమిని మ్యాన్, బండిష్ బ్యాండిట్ వంటి సినిమాలను పొందుతారు.

అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లో సెలబ్రిటీ క్యూరేటెడ్ మ్యూజిక్ ప్లే లిస్ట్ లను కూడా అందిస్తుంది. ప్రైమ్ డే సాధారణంగా భారతదేశం, యుఎస్ మార్కెట్లలో ఒకేసారి జరుగుతుంది. అయితే అమెజాన్ ఈసారి యుఎస్ కస్టమర్ల కోసం షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రూ. 999 లేదా ఏటా నెలవారీగా రూ.129 ప్రైమ్ డే సేల్స్ కోసం తప్పనిసరి ఉండాలి. ఉచిత ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ వంటి సేవలకు ఆక్సెస్ అందిస్తుంది.