పండగ సీజన్‌కు ముందే హైదరాబాద్‌లో రెండు కొత్త  ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను(ఈ కామర్స్ ఆర్డర్స్ షిప్పింగ్) ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్రారంభించింది. దీని ద్వారా అమెజాన్ ఇండియా తెలంగాణలో మౌలిక సదుపాయాలను మరింతగా విస్తరిస్తుంది.


ఈ విస్తరణతో అమెజాన్.ఇన్ ఇప్పుడు నాలుగు వేర్ హౌస్ కేంద్రాలలో 4.5 మిలియన్ క్యూబిక్ అడుగులకు పైనే  స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఇదివరకే ఉన్న వేర్ హౌస్ కేంద్రాన్ని లక్ష చదరపు అడుగులకుపైగా విస్తరించింది.

ఇప్పుడు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో 23,000 వ్యాపారులకు ప్రయోజనం చేకూరిస్తుంది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, టెలివిజన్లు తదితర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యేకం. 

"ఈ విస్తరణతో కొనుగోలుదారులకు, అమ్మకందారులకు లాభాలను అందించడానికి, రాబోయే పండుగ సీజన్ కంటే ముందే ప్రముఖ నగరాలుతో పాటు ఇతర రాష్ట్రాలలో కస్టమర్ ఆర్డర్‌లను వేగంగా అందించడానికి సహాయపడుతుంది" అని కంపెనీ ప్రకటన తెలిపింది.

also read టిక్‌టాక్ లాంటి యూట్యూబ్ "షార్ట్స్" యాప్ వచ్చేసింది.. ...

“ఈ విస్తరణతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. కస్టమర్ ఆర్డర్‌లను అందించడానికి  ఒక  ప్రాంతంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది.

ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్ తెలంగాణ అంతటా ఇ-కామర్స్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది ”అని అమెజాన్ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్స్, సప్లయ్ చైన్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ దత్తా అన్నారు.