బెంగళూరు: స్టార్టప్‌ కంపనీలు, దిగ్గజాల కంపెనీలతో సహ అన్నీ దాదాపు అన్నీ రంగాల్లో ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, ప్రముఖ ఆన్‌లైన్ రీటైలర్‌, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మాత్రం దీనికి భిన్నంగా కొత్త ఉద్యోగులు అవసరం ఉంది అంటూ తాజా ప్రకటించింది.

ప్రముఖ  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తమకు కొత్తగా 50 వేల సిబ్బంది అసవరం ఉంటుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పని సమయాల్లో   పనిచేయటానికి వీరిని తీసుకుంటామని తెలిపింది. 

 గత వారంలో చిన్న చిన్న కంపేనిల నుండి పెద్ద సంస్థల వరకు ఉద్యోగుల తొలగింపులపై వార్తల వెల్లువెతాయి. అమెజాన్ ఇండియా శుక్రవారం మాట్లాడుతూ, డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా కొత్తగా 50వేల ఉద్యోగాల ఓపెనింగ్స్ ఉండనున్నట్లు తెలిపింది.

also read అతి పెద్ద బ్యాటరీతో మోటో జి8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ...

అమెజాన్ ఫ్లెక్స్‌తో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ భారతదేశం అంతటా అమెజాన్‌ కేంద్రాలు,  డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ ఉద్యోగ అవకాశాలుంటాయని  ప్రకటించింది.


కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో వీలైనంత ఎక్కువ మందికి  సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్, ఎపిఐసి, మెనా & లాటామ్, కస్టమర్ ఫిల్లిమెంట్ ఆపరేషన్స్, విపి అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా వైరస్ సంక్షోభం, లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో భారీ తగ్గుదల కనిపించడంతో జోమాటో, స్విగ్గి, ఓలా, షేర్‌చాట్, వీవర్క్ వంటి సంస్థలు గత వారం ఉద్యోగాల తొలగింపులను ప్రకటించాయి.