అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ ఒక రోజు తరువాత అక్టోబర్ 17న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ప్రారంభించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు.

అమెజాన్ సెల్ 24 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది, అంటే అక్టోబర్ 16 న ప్రైమ్ సభ్యుల కోసం. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ కోసం భాగస్వామ్యం చేసుకుంది. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఏదైనా కొనుగోలుపై వినియోగదారులకు ఇన్స్టంట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లకు లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్, సేల్ సమయంలో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్లు అందిస్తున్నాయి. అమెజాన్ పే వినియోగదారులు రోజుకు 500 రూపాయల వరకు షాపింగ్ రివార్డ్ ప్రయోజనాలను అన్లాక్ చేయవచ్చు.

ప్రైమ్ సభ్యత్వం రెండు ప్యాక్ లలో లభిస్తుంది. ఒకటి నెలకి రూ .129, సంవత్సరానికి రూ .999. ప్రైమ్ సభ్యత్వంతో  ఫ్రీ వన్డే షిప్పింగ్, లాంచ్ డీల్స్ , ప్రైమ్ వీడియోకు ఇంకా  ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు http://www.amazon.in/prime కు ద్వారా ప్రైమ్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయవచ్చు.

also read గూగుల్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి కొత్త ఫీచర్‌.. ...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్  ద్వారా డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ సేల్ లో ఆపిల్ ఐఫోన్ 11 కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే దీన్ని అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 11 ను  సుమారు 50 వేల రూపాయల కంటే తక్కువకే అందించనుంది.

 ప్రస్తుతం భారతదేశంలోఐఫోన్ 11 ధర  68,300. దీంతో  ఐఫోన్ 11   ఇంటర్నల్ స్టోరేజ్ 64  జీబీ  వేరియంట్‌ ధర గణనీయంగా తగ్గనుందని అంచనా.  అలాగే ఎంపిక చేసిన  క్రెడిట్,  డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ / తక్షణ డిస్కౌంట్ ఆఫర్‌ను దీనికి అదనంగా అందించనుంది.

 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా ఎల్‌సిడి ప్యానెల్,  డాల్బీ అట్మోస్‌ , ఏ13 బయోనిక్ చిప్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్ డబుల్ కెమెరా, ఫేస్ ఐడితో 12 ఎంనఅ  ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా  3,190 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 11  ప్రధాన ఫీచర్లు.