అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. దసరా పండుగకు ముందే ఈ-కామర్స్ సైట్ అమెజాన్ వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకువచ్చిందని మనందరికీ తెలుసు. 

ఫెస్టివల్ సీజన్ లో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్బుతమైన డీల్స్, ఆఫర్స్ తో పాటు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు కూడా కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే, అమెజాన్ సేల్‌లోని డెల్, లెనోవా బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై  గొప్ప డీల్స్ ప్రవేశపెట్టింది.

మీరు ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లు చెల్లించడానికి మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే మీకు 10 శాతం అంటే (రూ .12000 వరకు)తగ్గింపు లభిస్తుందని తెలిపింది.

40వేల లోపు డెల్ వెస్ట్రో 3401 ల్యాప్‌టాప్‌
 డెల్ బ్రాండ్ ల్యాప్‌టాప్ (డెల్ వోస్ట్రో 3401) లో 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 1 టిబి హార్డ్ డిస్క్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, విండోస్ 10, 14.0 అంగుళాల ఫుల్‌హెచ్‌డి (1920 x 1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ డిస్ ప్లే ఉంది.

also read మొబైల్ డాటా త్వరగా అయిపోతుందా.. అయితే రిలయన్స్ జియో సూపర్ డాటా ప్లాన్స్ మీకోసమే.. ...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో డెల్ వెస్ట్రో 3401 ల్యాప్‌టాప్‌లపై లభించే డిస్కౌంట్
డెల్ ల్యాప్‌టాప్‌ల పై వినియోగదారులకు అమెజాన్ సేల్‌లో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్  పొందిన తర్వాత ఈ ల్యాప్‌టాప్‌ను రూ.35390 (ఎంఆర్‌పి రూ. 39413)కు సొంతం చేసుకోవచ్చు, అంటే మొత్తం రూ.4023 ఈ ల్యాప్‌టాప్‌పై  సేవ్ అవుతోంది.


50వేల లోపు లెనోవా ఐడియా ప్యాడ్ 3ఐ ల్యాప్‌టాప్‌
 లెనోవా ల్యాప్‌టాప్‌పై 35% తగ్గింపు లభిస్తుంది, డిస్కౌంట్ తర్వాత, ఈ ల్యాప్‌టాప్ రూ.47990 (ఎంఆర్‌పి 73890)కు విక్రయిస్తున్నారు. అంటే ఈ ల్యాప్‌టాప్‌ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా మొత్తం రూ.25900 రూపాయలు ఆదా అవుతుంది.

ఈ ల్యాప్‌టాప్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ :  10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్ డిడిఆర్ 4, 14 అంగుళాల పూర్తి హెచ్‌డి (1920 × 1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.6 కిలోలు.


50వేల లోపు డెల్ ఇన్స్పిర్యాన్ 3505  ల్యాప్‌టాప్‌
ఈ ల్యాప్‌టాప్‌లో కస్టమర్లు AMD రైజెన్ 5 3500U మొబైల్ ప్రాసెసర్‌తో రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్, 8 జిబి ర్యామ్, 15.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డి (1920 x 1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ ఎల్‌ఇడి బ్యాక్‌లిట్ డిస్ ప్లేతో  వస్తుంది.

ఈ డెల్ ఇన్స్పైరాన్ ల్యాప్‌టాప్ బరువు 1.83 కిలోలు. ఈ ల్యాప్‌టాప్‌పై 13 శాతం తగ్గింపు లభిస్తుంది, డిస్కౌంట్ తర్వాత ఈ ల్యాప్‌టాప్‌ను రూ .46990 (ఎంఆర్‌పి 53777) కు కొనుగోలు చేయవచ్చు. దీని అర్థం వినియోగదారులకు మొత్తం రూ.6787 ఆదా అవుతుంది.