కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమెజాన్ సంస్థ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ పొడిగించింది, వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయ‌వ‌చ్చు అని మంగళవారం తెలిపింది.

"ఇంటి నుండి పని చేయగలిగే ఉద్యోగులకు మాత్రమే  జూన్ 30, 2021 వరకు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నాము" అని అమెజాన్ ప్రతినిధి మంగళవారం ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. అమెజాన్ ఇంతకుముందు జనవరి వరకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అనుమతించింది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ యుఎస్ వ‌ర్క‌ర్లకు 19,000 ఈ సంవత్సరంలో కరోనావైరస్ సోకిన నేప‌థ్యంలో ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

కరోనా మహమ్మారి సమయంలో వేర్ హౌస్ ఓపెన్ చేసి ఉంచడం ద్వారా అమెజాన్ ఉద్యోగుల ఆరోగ్యం ప్రమాదంలో పడేస్తుందని కొందరు సిబ్బంది, అధికారులు చెబుతున్నారు.

also read అదిరిపోయే ఫిచర్లతో ఒప్పో ఎఫ్17ప్రో దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ...

"భౌతిక దూరం, సానిటైజేషన్, ఉష్ణోగ్రత తనిఖీలు, ఫేస్ కవరింగ్, హ్యాండ్ శానిటైజర్ ద్వారా ఆఫీసులకి వచ్చే వారిని సురక్షితంగా ఉంచడానికి మేము పెట్టుబడి పెట్టాము" అని అమెజాన్ ప్రతినిధి మంగళవారం చెప్పారు.

 మైక్రోసాఫ్ట్‌, ట్విట్ట‌ర్ లాంటి టెకీ సంస్థ‌లు కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ కూడా వ‌చ్చే జూలై వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పెంచింది. గూగూల్ కూడా ఆఫీసులో అవ‌స‌రం లేని వారికి ఇంటి నుంచి ప‌ని చేసే సౌల‌భ్యాన్ని జూన్ వ‌ర‌కు పొడిగించింది. 

ఇతర టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల కోసం హోమ్ ఆప్షన్ నుండి పనిని ఈ నెల ప్రారంభంలో విస్తరించాయి, ఈ నెల మొదట్లో చాలా మంది ఉద్యోగులు వారి వారపు పని గంటలలో సగం వరకు రిమోట్‌గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.