అమేజ్‌ఫిట్  నేడు రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2ఇ, జిటిఎస్ 2ఇలను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, అమెజాన్ ఫిట్  అధికారిక వెబ్‌సైట్ ద్వారా  జనవరి 19 నుండి ఈ రెండు స్మార్ట్‌వాచ్‌ల సేల్స్   ప్రారంభంకానున్నాయి.

అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2ఇ, జిటిఎస్ 2ఇ స్మార్ట్‌వాచ్‌ల ధర 9,999 రూపాయలు. వీటిలో జిటిఆర్ 2ఇను అబ్సిడియన్ బ్లాక్, స్లేట్ గ్రే, మోస్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు, అలాగే జిటిఎస్ 2ఇను అబ్సిడియన్ బ్లాక్, లిలక్ పర్పుల్, మోస్ గ్రీన్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సిఇఎస్ 2021) లో కంపెనీ ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లను ఆవిష్కరించింది. 

also read వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. ప్రపంచవ్యాప్తంగా సిగ్నల్ యాప్ డౌన్.. నిజమేనంటూ ట్వీట్.. ...

అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఇ, జిటిఎస్ 2ఇ స్మార్ట్‌వాచ్‌లో చాలా ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 471 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫీచర్స్ గురించి మాట్లాడుతూ, అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఇ క్లాసిక్ రౌండ్ డిజైన్‌తో  1.39-అంగుళాల అమోలెడ్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది.

దీని బ్యాటరీ లైఫ్ సంబంధించి 24 రోజుల బ్యాకప్‌ను క్లెయిమ్ చేసింది. 90 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు SpO2 వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

 50 వాచ్ ఫెసెస్, స్ట్రెస్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, 24x7 హార్ట్ బీట్ మానిటర్, ఉష్ణోగ్రత సెన్సార్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లో టెంపర్డ్ గ్లాస్ యాంటీ ఫింగర్ ప్రింట్ వాక్యూమ్ కోటింగ్ కూడా ఉంది. 

అమాజ్‌ఫిట్ జిటిఎస్ 2 ఇలో  1.65 అంగుళాల అమోలెడ్ హెచ్‌డి డిస్‌ప్లే, 14 రోజుల బ్యాటరీ లైఫ్, 90 స్పోర్ట్స్ మోడ్‌లు,  5ఏ‌టి‌ఎం  వాటర్ రిసిస్టంట్,  SpO2, హార్ట్ రేట్ మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.