ఎయిర్‌టెల్ సెలెక్టెడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్ ప్రవేశాపెట్టింది.  ఇప్పుడు రూ .219 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసే వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా యూజర్లు రీఛార్జ్ చేసుకుంటే ఉచిత కూపన్లను పొందవచ్చు.

ఇందుకోసం రూ .289, రూ .448, రూ .599 ప్రీపెయిడ్ రీఛార్జిలను ఎయిర్‌టెల్ జోడించింది. ఉచిత కూపన్ల వినియోగం రిడీమ్ చేసీన అదే రాత్రితో ముగుస్తుందని కస్టమర్లు గమనించాలి. ఉచిత డేటా కూపన్లు లభించే మూడు ప్లాన్లు కూడా ఓ‌టి‌టి సేవలను అందిస్తున్నాయి. ఈ ప్లాన్, వివరాలు మరింత సమాచారం మీకోసం

ఎయిర్‌టెల్ రూ .289 ప్రీపెయిడ్ ప్లాన్: 
రూ.289 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 28 రోజుల వాలిడిటీ, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సేవలు, ఉచిత హలో ట్యూన్స్,  జి5 ప్రీమియం సభ్యత్వంతో కల్పిస్తుంది. ఉచిత డేటా కూపన్  ద్వారా 1జి‌బి డేటాతో 2 కూపన్లను అందిస్తుంది, 28 రోజుల వరకు చెల్లుతుంది.

also read ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్స్.. ...

ఎయిర్‌టెల్ రూ .448 ప్లాన్: 
రూ .448 ప్లాన్ ఇటీవలే ప్రారంభించింది. డిస్నీ + హాట్‌స్టార్‌కు విఐపి సబ్ స్క్రిప్షన్ తో వస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3 జిబి డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వాలిడిటీ, 100 ఎస్‌ఎంఎస్‌లను చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఉచిత హలో ట్యూన్స్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ,  1GB డేటాతో  2 కూపన్లను కూడా ఇస్తుంది. 2 కూపన్లకు 1 జిబి చొప్పున ఉచిత డేటా కూపన్లు అందించే ఇతర ప్లాన్లు రూ .249, రూ .279, రూ .289, రూ .298, రూ .349, రూ .398.

ఎయిర్‌టెల్ రూ .599 ప్లాన్: 
రూ .599 ప్లాన్‌ను కూడా ఇటీవల లాంచ్ చేశారు. డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత వార్షిక విఐపి చందాతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3 జిబి డేటాతో పాటు అపరిమిత కాల్స్, 28 రోజుల చెల్లుబాటుతో  100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత హలో ట్యూన్స్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సేవలను కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్ 1 జిబి డేటాతో 4 కూపన్లు తీసుకువస్తుంది, 56 రోజులు పాటు వాలిడిటీ ఉంటుంది. రూ .399, రూ .449, రూ .558 ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ఉచిత రీఛార్జ్ కూపన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ తో 1 జీబీ డేటాకు 4 కూపన్లు వస్తాయి, 56 రోజుల వరకు వాలిడిటీ  ఉంటుంది

 ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన వినియోగదారులకు ఉచిత డేటా కూపన్లు ఇవ్వనున్నారు. ఎయిర్‌టెల్ డేటా కూపన్‌లను గెలుచుకుంటే ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలియజేయబడుతుంది. రోజువారీ విజేతల సంఖ్యకు పరిమితి లేదని ఎయిర్‌టెల్ తెలిపింది.