ఎయిర్‌టెల్ 5జిబి ఫ్రీ డేటా ఆఫర్.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి మాత్రమే..
డేటా కూపన్ల ద్వారా 5 జీబీ డేటా వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఒక్కొ కూపన్ ద్వారా 1 జిబి అంటే ఐదు కూపన్లకు 5 జిబి వస్తుంది. ఈ డేటా కూపన్లలో మొదటిది ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రీ డేటా, కాలింగ్ సదుపాయాలు ఇస్తుంది. తాజాగా ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది, కొత్త 4జి కస్టమర్లకు 5 జిబి ఫ్రీ డేటా కూపన్లను ఇస్తోంది.
కొత్త 4జి సిమ్ లేదా 3జి నుండి 4జి సిమ్ కి అప్‌గ్రేడ్ చేసుకున్నవారికి ఫ్రీ డేటా కూపన్లు అందిస్తుంది. డేటా కూపన్ల ద్వారా 5 జీబీ డేటా వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఒక్కొ కూపన్ ద్వారా 1 జిబి అంటే ఐదు కూపన్లకు 5 జిబి వస్తుంది. ఈ డేటా కూపన్లలో మొదటిది ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి అందుబాటులో ఉంటుంది.
ఈ వినియోగదారులు ఆఫర్‌ను పొందడానికి కొత్త వెర్షన్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్నవారికి 1 జిబి ఉచిత డేటా కూపన్లను ఇస్తోంది.
యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, కొత్త వినియోగదారులు మొబైల్ నంబర్ ఆక్టివేషన్ అయిన 30 రోజుల్లోపు వారి ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నా 72 గంటలలోపు యాప్ తెలియజేయబడతారు.
also read మైక్రోఫోన్, వాయిస్ కామండ్ ఫీచర్లతో కొత్త అమేజ్‌ఫిట్ పాప్ ప్రో స్మార్ట్‌వాచ్.. డిసెంబర్ 1న లాంచ్..
ఎయిర్‌టెల్ నిబంధనలు, షరతులలో ఈ ఆఫర్ వినియోగదారులు ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించిన తర్వాత మాత్రమే పొందవచ్చని పేర్కొంది.
ఉచిత డేటా కూపన్లను చెక్ చేయడానికి ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ లేదా నోటిఫికేషన్ వస్తుంది లేదా యాప్ లో మై కూపన్స్ విభాగాన్ని చెక్ చేయవచ్చు.
వినియోగదారులు క్రెడిట్ రోజు నుండి 90 రోజులు 1జిబి కూపన్లను రీడీమ్ చేయవచ్చు, 1జిబి కూపన్ రిడీమ్ చేసిన తర్వాత మూడు రోజులు ఆక్టివ్ గా ఉంటుంది తరువాత ఆటోమేటిక్ గా ముగుస్తుంది.
ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసే ప్రీపెయిడ్ వినియోగదారులకు 6 జీబీ డేటాను కూడా ఫ్రీగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ .1998 లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌ల కోసం ఆరు 1 జీబీ కూపన్‌లను పొందవచ్చు.
ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం రూ.399 లేదా అంతకంటే ఎక్కువ ధరతో ఎయిర్‌టెల్ 4 జీబీ ఫ్రీ డేటా కూపన్‌లను, రూ .219 లేదా అంతకంటే ఎక్కువ ధరతో ప్లాన్ తో 2 జీబీ ఉచిత డేటా కూపన్లను ఇస్తోంది. ఫ్రీ డాటా పొందడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి.