మీకు ప్రతి నెల మొబైల్ రీఛార్జి సమస్యగా ఉందా, ఎక్కువ కాలం వాలిడిటీ అందించే ప్లాన్స్ కోసం చూస్తున్నారా.. అయితే 365 రోజుల వాలిడిటీతో డేటా మాత్రమే కాకుండా, ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలు  అందించే ప్లాన్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎయిర్‌టెల్  కస్టమర్లు అయితే  ఎక్కువ కాలం వాలిడిటీతో  అధిక ప్రయోజనలు అందిస్తున్నా ప్రీపెయిడ్ ప్లాన్స్ పై పూర్తి సమాచారం మీకోసం..

ఎయిర్‌టెల్ రూ.2698 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో మీకు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, రోజుకు 2 జిబి హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయంతో 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనం ఏమిటంటే ఈ ప్లాన్‌తో కస్టమర్లు 1 సంవత్సరం పాటు ఉచిత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపికి అక్సెస్ పొందుతారు. రోజుకు 2 జిబి డేటా ప్రకారం ఈ ప్లాన్‌తో మొత్తం 730 జిబి డేటా లభిస్తుంది.    

also read వొడాఫోన్ ఐడియా డబుల్ డాటా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్లు ఇవే.. ఫుడ్ ఆర్డర్స్ పై డిస్కౌంట్ కూడా.. ...

ఎయిర్‌టెల్ రూ.2498 ప్లాన్ రీఛార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ : ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌ 365 రోజుల వాలిడిటీ వస్తుంది, మీకు రోజుకు 2 జిబి డేటాతో, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్ లు లభిస్తాయి. అన్నీ నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. రూ.2698 ప్లాన్‌లాగే ఈ ప్లాన్‌తో కూడా 730 జీబీ డేటా కూడా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 1498 ప్లాన్ ప్లాన్: రూ.1498 ప్లాన్‌తో 240 జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్, ఆన్ లిమిటెడ్ కాలింగ్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 ఉంటుంది.

పైన పేర్కొన్న అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో పాటు, వింక్ మ్యూజిక్, ఫ్రీ హాలోటూన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, 1 సంవత్సరాల వాలిడిటీతో షా అకాడమీ ఉచిత ఆన్‌లైన్ కోర్సు, ఫాస్టాగ్ కొనుగోలుపై రూ .150 క్యాష్‌బ్యాక్ వంటి కొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు.