చైనా టెలికాం దిగ్గజం హువావే పై అమెరికా నిషేదించిన తరువాత టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ వాడకాన్ని నిరోధించింది. తాజాగా ప్రత్యామ్నాయ స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే ఏడాది ఆరంభంలో స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులోకి రావోచ్చని హువావే తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌ల కోసం యాప్స్ రూపొందించే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకు హార్మొనీఓఎస్ సోర్స్ కోడ్ డిసెంబర్ నుంచి అందుబాటులో ఉంటుందని హువావే వినియోగదారు ఉత్పత్తుల విభాగం సిఇఒ యు చెంగ్‌డాంగ్ తెలిపారు. హార్మొనీఓఎస్ ఇప్పటివరకు స్మార్ట్ టీవీలు, ఇన్-కార్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, వెరబుల్ డివైజెస్ లాతో సహా కొన్ని ఉత్పత్తులలో మాత్రమే ఉపయోగిస్తుంది.

also read రెడ్‌మీ 9 సిరీస్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ? ...

కానీ  కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లతో ఉపయోగించలేదు. శామ్సంగ్ తరువాత హువావే ప్రపంచంలోనే  రెండవ అతి పెద్ద  స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ. సైబర్ సెక్యూరిటీ ముప్పు కారణంగా హువావే సంస్థ యునైటెడ్ స్టేట్స్ లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది.

కానీ హువావే, చైనా ప్రభుత్వం రెండూ ఈ ఆరోపణలను ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హువావేని యుఎస్ మార్కెట్ నుండి నిరోధించింది. 5జి, ఇతర టెలికాం-నెట్‌వర్క్ పరికరాలకు ప్రపంచ లీడర్ ఉన్న హువావే సంస్థ తయారుచేసిన ఉత్పత్తులను నిషేధం విధించాలని అమెరికా ఇతర దేశాలను కూడా ఒత్తిడి చేస్తోంది.

దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన  వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల సమావేశంలో హార్మొనీఓఎస్‌పై హువావే ప్రకటన చేసింది.  చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది, అయితే  గ్లోబల్ వినియోగదారులను హార్మొనీఓఎస్ వైపు ఆకర్షించడానికి ఒక వేదికగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.