Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో తక్కువ ధరకే లభించే 3 బెస్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్లు ఇవే..

బడ్జెట్ ధరలో రూ.2500 లోపు లభించే 3 బెస్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్‌లు గురించి మీకోసం.  ప్రజలు వారి ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తుంటారు కాని ప్రస్తుతం పని ఒత్తిడి పెరగడం, ఇంట్లో ఉంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తినడం, కూర్చోవడం  వల్ల మీరు హెల్త్ ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టలేకపోతే తిరిగి ఫిట్ నెస్ వ్యాయామాలు మళ్లీ ప్రారంభించాలనుకుంటే ఫిట్‌నెస్ బ్యాండ్ కొనడం మంచి ఆప్షన్.

3 best fitness bands under 2500 in india-sak
Author
Hyderabad, First Published Oct 5, 2020, 6:02 PM IST

కరోనా లాక్ డౌన్ వల్ల జిమ్, ఫిట్ నెస్ సెంటర్లు మూతపడటంతో ప్రజలు ఇంట్లోనే వ్యాయామాలు, వర్క్ ఔట్లు చేస్తున్నారు. దీంతో ఎలక్త్రోనిక్ గ్యాడ్జెట్స్ వాడకం కాస్త పెరిగింది. తాజాగా కొన్ని సంస్థలు ఫిట్ బ్యాండ్స్ కూడా ఆవిష్కరించాయి. బడ్జెట్ ధరలో రూ.2500 లోపు లభించే 3 బెస్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్‌లు గురించి మీకోసం. 

ప్రజలు వారి ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తుంటారు కాని ప్రస్తుతం పని ఒత్తిడి పెరగడం, ఇంట్లో ఉంటూనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తినడం, కూర్చోవడం  వల్ల మీరు హెల్త్ ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టలేకపోతే తిరిగి ఫిట్ నెస్ వ్యాయామాలు మళ్లీ ప్రారంభించాలనుకుంటే ఫిట్‌నెస్ బ్యాండ్ కొనడం మంచి ఆప్షన్.

స్మార్ట్ బ్యాండ్ సహాయంతో మీరు కేలరీలు, హార్ట్ బీట్ రేట్, స్లిపింగ్ టైమ్ మొదలైనవాటిని ట్రాక్ చేయవచ్చు. భారతీయ మార్కెట్లో రూ.2500 కన్నా తక్కువ ధరకే లభించే ఉత్తమ ఫిట్‌నెస్ బ్యాండ్‌ల గురించి తెలుసుకుందాం.

also read  గూగుల్ మ్యాప్స్‌లో మీ కార్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్: ఈ రెడ్‌మి బ్యాండ్ అత్యంత బడ్జెట్ స్మార్ట్ బ్యాండ్లలో ఒకటి. వినియోగదారులు ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను 1,599 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే 1.08 అంగుళాల కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఐదు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అంతే కాదు ఈ రియాలిటీ బ్యాండ్ కూడా స్లీప్ క్వాలిటీ  ఆప్షన్ కూడా ఉంది. 24 గంటల హార్ట్ బీట్ ట్రాకింగ్‌తో వస్తుంది. 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

హానర్ బ్యాండ్ 5: ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌లో 0.95 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, ట్రూసిన్ 3.0 హార్ట్ రేట్ మానిటర్, స్విమ్ స్ట్రోక్ రికగ్నిషన్, స్లీప్ మానిటర్ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ హానర్ బ్యాండ్‌లో 10 వేర్వేరు ఫిట్‌నెస్ మోడ్‌లు లభిస్తాయి. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టంట్ తో వస్తుంది. భారతదేశంలో ఈ బ్యాండ్ ధర 2299 రూపాయలు.

ఎం‌ఐ బ్యాండ్ 5 : షియోమి ఇటీవల తన సరికొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో ఎం‌ఐ  బ్యాండ్ 5 స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ ధర రూ .2,499. ఎం‌ఐ  బ్యాండ్ 1.1 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 24 × 7 హార్ట్ రేట్ మానిటర్, ఆర్‌ఈ‌ఎం (వేగవంతమైన కంటి కదలిక) ట్రాకింగ్, స్ట్రెస్   మానిటర్ సహా పలు ఫీచర్స్ ఉన్నాయి.

ఎం‌ఐ బ్యాండ్ 5 వర్సెస్ ఎం‌ఐ  బ్యాండ్ 4: ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కొత్త ఎం‌ఐ బ్యాండ్ 11 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లతో, 21 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఎం‌ఐ బ్యాండ్ పి‌ఏ‌ఐ (పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్) తో వస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios