పాకిస్తాన్ ప్రముఖ బ్యాట్స్ మెన్ ఇమామ్ ఉల్ హక్ ... ప్రేమ పేరిట అనేక మంది యువతులను మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనకు ఉన్న క్రికెటర్ అనే స్టార్ డమ్ ని వినియోగించుకొని యువతలకు వలపు ఎర విసిరినట్లు సమాచారం. ఈ మేరకు అతను పలవురు యువతలకు చేసిన మెసేజ్ ల స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే...పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన స్టార్ డమ్ ని వినియెగించుకొని చాలా మంది యువతులను మోసం చేశాడని తెలుస్తోంది. ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు.  కేవలం గత ఐదు, ఆరు నెలల్లోనూ ఈ పనులకు పాల్పడినట్లు సమాచారం. ఓ వైపు వరల్డ్ కప్ జరుగుతున్నా.. తన కార్యకలాపాలను ఇమామ్ కొనసాగించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఇమామ్ తమకు చేసిన మెసేజ్ లను యువతులు కొందరు నెట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. అయితే ఈ ఆరోపణలను కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ క్రికెటర్ పై మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఇమామ్ స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే... ప్రపంచకప్ లో సరైన ప్రదర్శన ఇవ్వలంటూ ఇమామ్ పై ఆరోపణలు ఉండగా... తాజాగా ఇవి మరింత తలనొప్పిగా మారాయి.