ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా చేతిలో ప్రపంచ మాజీ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది. ఇవాళ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 6-4, 4-6, 7-5 తేడాతో సెరెనా పరాజయం పాలైంది.

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయిన సెరెనా.. పుంజుకుని వెంటనే రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే చివరిలో విజయం ఇద్దరి మధ్యా దోబూచులాడినప్పటికీ ఫైనల్‌గానే ప్లెస్కోవానే విజయం వరించింది.

ఈ ఓటమితో 24వ గ్రాండ్ స్లామ్ నెగ్గాలని భావించిన సెరెనా ఆశలు గల్లంతయ్యాయి. కాగా, 2016 యూఎస్ ఓపెన్‌ సెమీస్‌లో కూడా ప్లిస్కోవా చేతిలో సెరెనా ఓటమి పాలైంది. ఈ విజయంతో కరోలినా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.