అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి జూలు విదిల్చింది.. యూఎస్ ఓపెన్‌  ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో లాత్వియా క్రీడాకారిణి సెవాస్తోవాపై 6-3, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది. కేవలం 66 నిమిషాల్లో లాత్వియాను సెరెనా మట్టికరిపించింది. ఈ ఫైనల్లో సెరెనా విలియమ్స్ విజయం సాధిస్తే.. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లే.. ఇప్పటి వరకు సెరెనా  గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఈ ఫైనల్ కలిపి మొత్తం 31 సార్లు ఫైనల్స్‌కు వెళ్లింది.