న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన కృనాల్ పాండ్యాపై అతడి సోదరుడు, తోటి క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. కృనాల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హార్ధిక్ '' నిన్ను చూసి ఎంతొ గర్వపడుతున్నా పెద్దన్న'' అంటూ ఓ కామెంట్ ను జత చేశాడు. ఈ పోస్ట్ కు నెటిజన్ల నుండి విశేషమైన స్పందన వస్తోంది. 

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో ఆక్లాండ్ లో జరిగిన  రెండో టీ20లో టీంఇండియా బరిలోకి దిగింది. అయితే మొదటి మ్యాచ్ మాదిరిగానే ఇందులో కూడా న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆక్లాండ్ లొ భారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. 

ముఖ్యంగా కృనాల్ మూడు వికెట్లు పడగొట్టి కివీస్ జట్టు నడ్డి విరిచాడు.  అంతేకాకుండా చాలా తక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో కేవలం 158 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ లక్ష్యాన్ని టీంఇండియా సునాయాసంగా చేదించింది. ఇలా భారత జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించిన కృనాల్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్  అందుకున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Proud of you big bro @krunalpandya_official 🔝🇮🇳❤

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Feb 8, 2019 at 5:34am PST