ప్రో కబడ్డి లీగ్ 2019 లో యూ ముంబా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ పార్చూన్ జాయింట్స్ తో తలపడ్డ ముంబై కేవలం 6పాయింట్ల స్వల్ఫ తేడాతో గెలుపొందింది. ఇరు జట్లు రైడింగ్ లో  సమానంగా పాయింట్లు సాధించినా  ట్యాకిల్ పాయింట్ల విషయంలో గుజరాత్ వెనుకబడిపోయింది. ఇలా డిపెండర్స్ రాణించడంతో ముంబై ఈ సీజన్ 7 లో మరో విజయాన్ని అందుకుంది. 

యూ ముంబా ఆటగాళ్లలో అభిషేక్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి సురీందర్ 4, సందీప్ 3, హరేంద్ర 3, ఫజల్ 2, రోహిత్ 2 పాయింట్లతో చక్కటి సహకారం అందించారు. దీంతో రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో  మరో  2 ఇలా మొత్తం 31 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 

ఇక గుజరాత్ విషయానికి వస్తే రైడర్స్ ముంబైతో పోటిగా నిలిచినా డిఫెండర్స్ మాత్రం చేతులెత్తుశారు. ఇలా రైడింగ్ లో ముంబై తో సమానంగా 15 పాయింట్లు సాధించగా ట్యాకిల్స్ లో మాత్రం 5 పాయింట్లతో వెనకబడింది. అంతేకాకుండా ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ ట్రాల రూపంలో 3 మొత్తం 25 పాయింట్లు మాత్రమే సాధించి  ఓటమిపాలయ్యింది. ఆటగాళ్లలో రోహిత్ 9, మోరే 5 పాయింట్లు సాధించినా మిగతా ఆటగాళ్ళ నుండి సహకారం అందకపోవడం గుజరాత్ పరాజయంపాలవ్వాల్సి వచ్చింది.