భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడారిణి మార్టినా హింగిస్ జోడీ డబుల్స్ లోనే కాదు నిజజీవితంలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నట్లున్నారు. ఈ జోడీ టెన్నిస్ మహిళల డబుల్స్ లో అనేక విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు. అయితే వీరు క్రీడల్లోనే కాదు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ జీవితాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా గడుపుతున్నారు. అయితే ఈ డబుల్స్ జోడీ  ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి అభిమానులను అలరించారు. అయితే గతకొన్ని రోజులుగా వీరు టెన్నిస్ కు దూరంగా ఉంటూ తమ కుటుంబానికే పరిమతమయ్యారు.

తాజాగా హైదరబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తాను  తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈమె టెన్నిస్ జోడీ మార్టినా హింగిస్ కూడా  తల్లికాబోతుందట.  తన పుట్టినరోజు సందర్భంగా స్వయంగా మార్టినానే ఈ విషయాన్ని వెల్లడించింది. 

సోషల్ మీడియా లో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు మరో తీపికబురు అందించింది. తనకు విషెస్ చెప్పిన అభిమానులతో మరో శుభవార్త  పంచుకుంటున్నానంటూ...తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు వెల్లడించింది. త్వరలో తాను ఓ చిన్నారికి జన్మనిచ్చి తల్లిని కాబోతున్నట్లు తెలిపింది. తమ కుటుంబంలో మరో పాపాయి చేరడంతో ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య మూడుకు చేరనుందంటూ హింగిస్ తన ఆనందాన్ని పంచుకుంది.