Asianet News TeluguAsianet News Telugu

మాథ్యూ హెడెన్ తలపై తమిళనాడు మ్యాప్ : జాంటి రోడ్స్

ఆసిస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ఇటీవల ప్రమాదవశాత్తు తీవ్రంతా గాయపడిన విషయం తెలిసిందే. హెడెన్ తన ఫ్యామిలీతో కలిసి క్వీన్ ల్యాండ్ విహారానికి వెళ్లి అక్కడ సరదాగా సర్పింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గాయాలతో కూడిన ఫోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు హెడెన్ గాయపడటంపై బాధను వ్యక్తం చేశారు. కానీ దక్షిణాప్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ మాత్రం ఈ పోటోపై కాస్త భిన్నంగా స్పందించాడు.

Jonty Rhodes Finds Tamil Nadu map in  Hayden's Head
Author
New Delhi, First Published Oct 9, 2018, 4:44 PM IST

ఆసిస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ఇటీవల ప్రమాదవశాత్తు తీవ్రంతా గాయపడిన విషయం తెలిసిందే. హెడెన్ తన ఫ్యామిలీతో కలిసి క్వీన్ ల్యాండ్ విహారానికి వెళ్లి అక్కడ సరదాగా సర్పింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గాయాలతో కూడిన ఫోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు హెడెన్ గాయపడటంపై బాధను వ్యక్తం చేశారు. కానీ దక్షిణాప్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ మాత్రం ఈ పోటోపై కాస్త భిన్నంగా స్పందించాడు.

హెడెన్ తలపై వున్న గాయం అచ్చం తమిళనాడు మ్యాప్ ను పోలి ఉందంటూ జాంటీ రోడ్స్ తెలిపాడు. హెడెన్ పోటోపై రోడ్స్ ఇలా స్పందించాడు. ''హెడెన్... తలపై తమిళనాడు మ్యాప్ ను వేసుకున్నావా? తమిళనాడు పై నీకున్న నిబద్దతకు ఇది నిదర్శనం...నిన్ను అనుసరించి చాలా మంది ఇక తమిళనాడు మ్యాప్ టాటూలు వేసుకునే అవకాశం ఉంది'' అంటూ కామెంట్ చేశాడు.

రోడ్స్ ఇలా కామెంట్ చేయడానికి కారణం...గతంలో హెడెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించడమే. ఇలా తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హెడెన్ ఆ జట్టుపై తన ప్రేమను చాటుకున్నాడు అని అర్థం వచ్చేలా రోడ్స్  కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వెలువడుతోంది. కొందరు అతడి ట్వీట్ ను తప్పుబడుతుండగా మరికొందరు సరదాగా తీసుకుంటున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో హెడెన్ కు మంచి అనుబంధం ఉంది. ఐపిఎల్ ఆరంభంలో ఇతడు ఓపెనర్ గా సీఎస్‌కె తరపున అద్యుతంగా  ఆడాడు. దీంతో తమిళ్ప్రజలు అతడికి అభామానులుగా మారిపోయారు. అలాగే రోడ్స్ కు కూడా ఐపిఎల్ తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇతడు ముంబాయి ఇండియన్స్ జట్టు కోచ్ గా పనిచేశాడు. ఇలా ఐపిఎల్ ద్వారా ఇండియా గురించి పూర్తిగా తెలుసుకున్న రోడ్స్ చివరకు హెడెన్ గాయంలో తమిళనాడు మ్యాప్ ను గుర్తించాడు. 


Jonty Rhodes Finds Tamil Nadu map in  Hayden's Head


సంబంధిత వార్తలు 

హాలిడే ట్రిప్ లో.. తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్

Follow Us:
Download App:
  • android
  • ios