Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్స్‌ గేమ్స్‌లో ఐదో స్వర్ణం... గోల్డ్ మెడల్ గెలిచిన పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్‌...

సింగపూర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్... భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. 

Commonwealth Games 2022: Team India Mens Table Tennis Team Wins Gold medal
Author
India, First Published Aug 2, 2022, 8:21 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్, ఫైనల్‌లో సింగపూర్‌పై విజయం సాధించి, వరుసగా రెండో ఏడిషన్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించింది...

డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి, సింగపూర్ డబుల్స్ జోడి యంగ్ ఇజాక్ క్వెక్- యో ఎన్ కోన్ పంగ్‌పై 13-11, 1-7, 11-5 తేడాతో విజయం సాధించి... టీమిండియాకి 1-0 తేడాతో ఆధిక్యం అందించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత స్టార్ టీటీ ప్లేయర్ శరత్ కమాల్, తన ప్రత్యర్థి క్లెరెన్స్ చ్యూతో జరిగిన మ్యాచ్‌లో 11-7, 12-14, 11-3, 11-9 తేడాతో పోరాడి ఓడిపోయాడు...

దీంతో ఫైనల్ స్కోరు 1-1 తేడాతో సమం అయ్యింది. ఆ తర్వాత కొన్ పంగ్‌ని 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో విజయాన్ని అందుకున్న జీ సాథియన్.. భారత్‌కి 2-1 తేడాతో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత హర్మీత్ దేశాయ్, క్లెరెన్స్ చ్యూతో జరిగిన మ్యాచ్‌లో 11-8, 11-5,11-6  తేడాతో విజయాన్ని అందుకుని 3-1 తేడాతో భారత టీటీ టీమ్‌కి గోల్డ్ మెడల్ అందించాడు...

అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 1-3 తేడాతో పరాజయం పాలైంది. గ్రూప్ స్టేజీలో రెండు విజయాలు అందుకున్న భారత మహిళా హాకీ జట్టుకి ఇది తొలి పరాజయం. రేపు వరల్డ్ 15 ర్యాంకర్ కెనడాతో ఫైనల్ గ్రూప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. టాప్ 2లో ముగించి నాకౌట్ స్టేజీకి అర్హత సాధించాలంటే రేపటి మ్యాచ్‌లో కచ్ఛితంగా విజయం సాధించాల్సి ఉంటుంది భారత జట్టు...

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్ అద్భుతం చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్‌లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్, ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్‌ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకుంది...

భారత వుమెన్ లాన్ బౌల్స్ టీమ్‌లోని రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్... ఫైనల్‌లో ఆరంభం నుంచి సౌతాఫ్రికాపై ఆధిక్యాన్ని కొనసాగించారు. ఒకానొక దశలో 8-2 తేడాతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిక్యం కనబర్చింది భారత జట్టు...

అయితే మూడు సార్లు కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ గెలిచిన సౌతాఫ్రికా ఆ తర్వాత ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చి 8-8 తేడాతో స్కోర్లను సమం చేసింది. ఆ తర్వాత భారత జట్టు 10-8 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లగా మరోసారి సౌతాఫ్రికా 10-10 తేడాతో స్కోర్లను సమం చేసింది...

ఆఖరి 3 రౌండ్లలో భారత జట్టు ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. 13 ఎండ్స్‌ ముగిసే సమయానికి 12-10, 14 ఎండ్స్‌ ముగిసే సమయానికి 15-10 తేడాతో ఆఖరి ఎండ్‌ని 17-10 తేడాతో ముగించి లాన్ బౌల్స్‌లో మొట్టమొదటి స్వర్ణం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 16-13 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకొచ్చింది భారత లాన్ బౌల్స్ టీమ్...

ఈ విజయంతో భారత్ ఖాతాలో 11 పతకాలు చేరాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios