ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెర్బియా ఆటగాడు జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో స్పెయిన్ క్రీడాకారుడు, ప్రపంచ మాజీ చాంపియన్ రఫెల్‌నాదల్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

6-3, 6-2, 6-3 సెట్ల తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ విజయంతో జకోవిచ్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ఏడు సార్లు ఫైనల్ చేరి ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా ఎమర్సన్, రోజర్ ఫెదరర్ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు.