ప్రస్తుతం శ్రీశాంత్ హిందీ బిగ్ బాస్ సీజన్ 12లో పార్టిసిపెంట్ గా ఉండగా.. సచిన్ తో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తోటి హౌజ్ మేట్స్ తో పంచుకున్నారు.

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ని అభిమానించని వారి సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది. సాధారణ ప్రజల నుంచి ఆయన తోటి క్రికెటర్లు కూడా సచిన్ ని ఆరాధిస్తుంటారు. కాగా.. సచిన్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు మాజీ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్. ప్రస్తుతం శ్రీశాంత్ హిందీ బిగ్ బాస్ సీజన్ 12లో పార్టిసిపెంట్ గా ఉండగా.. సచిన్ తో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తోటి హౌజ్ మేట్స్ తో పంచుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘2011లో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత ఓసారి మా ఆటగాళ్లంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాం. ఆ సమయంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి టీమిండియా కప్పు గెలిచిన సందర్భాన్ని గొప్పగా వివరిస్తూ క్రికెటర్లందరి పేర్లు చెప్పాడు. కానీ నా పేరు మాత్రం చెప్పలేదు. నేనూ మధ్యలో మాట్లాడలేదు. ఇంటర్వ్యూ ముగిసేవరకూ మౌనంగానే ఉన్నా. చివరి నిమిషం వరకూ ఆ విలేకరి నా పేరును ప్రస్తావించలేదు. అప్పుడు సచిన్‌ కలగజేసుకుని..‘2011 వరల్డ్‌ కప్‌ సమయంలో శ్రీశాంత్‌ కీలక పాత్ర పోషించారు’ అన్నారు. ఆయన మాటలు విని నేను చాలాసేపటి వరకు ఏడ్చాను’ అని వెల్లడించారు శ్రీశాంత్‌.

2013లో ఐపీఎల్‌ సమయంలో శ్రీశాంత్ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. దాదాపు ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీశాంత్‌ ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు చేస్తున్నారు.