Asianet News TeluguAsianet News Telugu

అఖండ భారతావనిలో వినాయక చవితి పండగ

క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరుగకుండా, తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెప్పబడింది. అందుకే విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు వినాయకుని

When is Ganesh Chaturthi 2020? History, Significance
Author
Hyderabad, First Published Aug 22, 2020, 7:18 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

When is Ganesh Chaturthi 2020? History, Significance

వినాయక చవితి యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక, గోవా,  తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది. హైదరాబాద్, కర్నాటక ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాన్ని దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు అంటే అతిశయోక్తి లేదు. ఈ పండుగ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప వేడుకగా జరుపబడుతుంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుని భావిస్తారు. వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు, క్రమంగా చేపట్టిన ఎటువంటి ప్రాజెక్ట్ అయినా విజయవంతం అయ్యేందుకు సహాయపడుతాడని చెప్పబడింది. ఏ పనిని ప్రారంభించినా, పూజ లేదా యజ్ఞయాగాదులకు తలపెట్టినా, ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. 

క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరుగకుండా, తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెప్పబడింది. అందుకే విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు వినాయకుని. తరచుగా వినాయకుని శ్లోకాలు చదవడం, వినడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు, సంవత్సరంలో ఒకరోజు అతిధిగా వచ్చి తొమ్మిది రోజులు పూజలందుకుంటాడు, ఆ నవరాత్రులలో మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు, క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని చెప్పబడింది. పదోరోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు. 

వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత :- ఈ వినాయక చవితి పండుగ నిజానికి ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరికీ సరైన అవగాహన లేనప్పటికీ, మహారాష్ట్రలో శివాజీ ( మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ) పాలనలో ఈ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకునికోసం ఈ పండుగని జరుపుకునేవారు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు, తనను పూజించిన భక్తుల పట్ల కృపతో ఆయా కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తిచేయడంలో సహాయపడుతాడని చెప్పబడింది. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్ననాయకుని పూజించడం జరుగుతుంది. 

వినాయక చవితి ఎలా జరుపుకుంటారు:-  వినాయక చవితి రోజున శ్రేష్ఠమైన వినాయకుని మట్టి ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి, ఈ ప్రతిమను నవరాత్రులు పూజించడం జరుగుతుంది. నవరాత్రుల తరువాత, విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్లి, సముద్రంలో లేదా నదిలో, చెరువులలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు మూడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. 

విగ్రహ నిమజ్జనం దృష్ట్యా ఖచ్చితంగా నదులు సముద్రాల వద్దకే పోనవసరం లేదు. పారుతున్న నదిలోకలిసే పిల్లకాలువలు, శుభ్రంచేసిన బక్కెట్ నీళ్ళలో కూడా మట్టి విగ్రహాన్ని( రసాయనాలు లేని ) నిమజ్జనం చేసి చెట్ల పాదులకు వేయవచ్చని సూచించబడినది. క్రమంగా పర్యావరణాన్ని కూడా కాపాడిన వారవుతారు. భావితరాలను కాలుష్యకోరలకు గురిచేయకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత కూడా మనమీద ఉందని మరచిపోరాదు. ప్రస్తుతం కరోనా కాల సమయం కాబట్టి అందరూ సామాజిక భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలతో ప్రభుత్వ సూచనలను గౌరవిస్తూ వ్యవహరిద్దాం, మట్టి గణపతులనే పూజిద్దాం.    

వినాయకుని స్థాపన ముహూర్తం:-  వినాయకుని పూజ ఉదయము 7:35 నిమిషాల నుండి 9 గంటల లోపుగా లేదా  11 గంటల నుండి సాయంకాలం వరకు నిర్వహించుకొని విగ్నేశ్వరుని అనుగ్రహమును మీరందరూ పొందగలరని ఆశీర్వదించనైనది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios