శ్రావణ అమావాస్య.. ఆ దోషంతో బాధపడుతున్నారికి విముక్తి..!
ఈ అమావాస్య రోజున పితృపూజ జరిపిస్తే.. చాలా మంచి జరుగుతుందట. అంతేకాదు.. మంచి వర్షాలు పండాలని.. రైతులకు మంచి పంట పండాలని కూడా.. ఈ రోజున దేవుళ్లకు పూజలు చేస్తుంటారట.
జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలోనే ఎక్కువ శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ ఆదివారం అంటే.. ఆగస్టు 8వ తేదీన అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య ఎంతో విశిష్టత కలిగి ఉందని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ అమావాస్య నే హరియాలి అమాస్య అని కూడా పిలుస్తారు.
ఈ అమావాస్య రోజున పితృపూజ జరిపిస్తే.. చాలా మంచి జరుగుతుందట. అంతేకాదు.. మంచి వర్షాలు పండాలని.. రైతులకు మంచి పంట పండాలని కూడా.. ఈ రోజున దేవుళ్లకు పూజలు చేస్తుంటారట.
ఈ అమావాస్య ఆదివారం ఆగస్టు8వ తేదీన వస్తోంది. ఆగస్టు7వ తేదీ రాత్రి 7గంటల 11 నిమిషాలకు ప్రారంభమై.. ఆగస్టు8వ తేదీ రాత్రి7గంటల 19 నిమిషాలకు ముగియనుంది.
ఈ అమావాస్య ప్రత్యేకత..
ఈ అమావాస్యకు విశిష్టత ఎక్కువగా ఉందని జోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి... ఎలాంటి దోషాలు ఉన్నా.. ఈ రోజు పూజ చేస్తే తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా కాల సర్ప దోషం ఉన్నవారు.. పూజ చేస్తే.. ఆ దోషం తొలగిపోయి.. వారికి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.