Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకోవాలి..?

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్నందున.. వినాయక మండపాలు నిర్వహించే అవకాశం కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గణేషుడిని ఇంట్లోనే జరుపుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇంట్లోనే వినాయక చవితిని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Ganesh Chaturthi 2020: Date, time and how to perform Ganpati puja at home!
Author
Hyderabad, First Published Aug 21, 2020, 10:39 AM IST

దేవతంలందరిలోనూ ఆది దేవుడు వినాయకుడు. ఆ వినాయకుడిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో తొమ్మిది రోజుల పాటు పూజించుకుంటాం.
భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక మండలం తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. అందుకే ఆరోజున వినాయక వ్రతం చేసు కుంటాం. ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన వినాయక చవితిని ప్రజలందరూ జరుపుకోనున్నారు. 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్నందున.. వినాయక మండపాలు నిర్వహించే అవకాశం కనపడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గణేషుడిని ఇంట్లోనే జరుపుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇంట్లోనే వినాయక చవితిని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గణేష్ చతుర్థి పూజ సమయం..

గణేష్ చతుర్థి. శనివారం, ఆగస్టు22,2020
మధ్యాహ్న గణేష పూజా ముహుర్తం.. 11:06am to 01:42PM
గణేష నిమజజనం.. మంగళవారం సెప్టెంబర్ 1,2020

ఇంట్లో వినాయక ప్రతిమను పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకునేవారు ముందుగా.. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు కావాల్సిన పూలు, పండ్లు, పత్రాలు, కొబ్బరికాయ, స్వామివారి విగ్రహం అన్నీ తెచ్చుకోవాలి.

పూజా విధానం..

ముందుగా.. వినాయక పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని తెచ్చుకోవాలి. మట్టి గణపయ్య విగ్రహాన్ని కూడా ముందుగా తెచ్చి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా.. స్వామి వారికోసం ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత.. ఆ మండపంపై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం గణపతి పూజతో ప్రారంభించాలి.

విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో.. దానికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది. మూర్తి యొక్క ప్రాణ-ప్రతిష్ఠంతో చేసిన తరువాత స్వామివారి ముందు దీపారాదన చేయాలి. పండితులు మీ కోసం ఈ మొత్తం పూజలు చేస్తుంటే, గణేష్ కు నివాళి అర్పించే 16 రూపాలు అర్పించి.. స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాకుండా.. మనసులోని కోరికను కోరుకోవచ్చు. తర్వాత 21 రకాల పత్రి, పూలతో స్వామివారిని పూజించాలి.

ఎర్రటి కుంకుమను స్వామివారి విగ్రహానికి పెట్టాలి. పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత స్వామివారి వాహనమైన మూషిక(ఎలుక) కు ధాన్యాలు పెట్టడం మరిచిపోవద్దు.  వినాయకుడి 108 శ్లోకాలు చదవడం మంచిది. పూజ మొత్తం భక్తి శ్రద్ధలతో చేయాలి. 

బహిరంగ మనస్సుతో మరియు పవిత్రమైన ఆలోచనలతో మీరు ఎంత ఎక్కువ ఆరాధించారో-గణపతి మీకు జ్ఞానం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఇస్తుంది.

కచ్చితంగా చదవాల్సిన శ్లోకం..

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్‌

భక్తావాసం స్మరేనిత్యం

ఆయుష్కామార్థసిద్ధయే

తాత్పర్యం : దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన, ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.

ప్రదశమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్‌

తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్‌

ప్రదశమనామం వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు) ద్వితీయ నామం : ఏకదంత (ఒకే దంతం కలవాడు) తృతీయ నామం, కృష్ణపింగాక్ష (ముదురు గోధుమరంగు కన్నులవాడు) చతుర్థనామం : గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవచ

సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్‌

పంచమ నామం లంబోదరం (పెద్ద పొట్టకలవాడు) షష్ఠమనామం : వికట (భారీ కాయం కలవాడు) సప్తమ నామం : విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు) అష్టమ నామం ధూమ్రవర్ణ ( గచ్చకాయ రంగు కలవాడు)

నవమం బాలచంద్ర చ దశమంతు వినాయకమ్‌

ఏకాథం గణపతిం ద్వాథంతు గజాననమ్‌

నవమ నామం బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు) దశమం వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం : గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం : గజానన (ఏనుగు ముఖము కలవాడు)

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధి కరం ప్రభుః

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్‌

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్‌

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్‌

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్‌

తస్యవిద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

ద్వాదశ నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్యవృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికీ పుత్ర సంతానం మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షం సిద్ధించును.

ఈ సంకలనాశన గణపతి స్తోత్రం ఆరుమాసాలపాటు జపించిన వారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏ మాత్రం సందేహంలేదు.

ఈ సంకలనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మణులకు దానం చేసిన యెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.

Follow Us:
Download App:
  • android
  • ios