Asianet News TeluguAsianet News Telugu

నస్రతుల్ అబ్రార్: హిందూ-ముస్లిం ఐక్యతకు అనుకూలంగా ఉలేమా ద్వారా ఫత్వా.. ఏం చెప్పిందంటే..

సర్ సయ్యద్ హిందువులు, ముస్లింలు వేర్వేరు ప్రయోజనాలతో రెండు వేర్వేరు క్వామ్‌లు (దేశాలు/సమాజాలు) అని పేర్కొన్నారు. క్రైస్తవులు ముస్లింలకు సహజ మిత్రులని.. హిందువులు శత్రువులని ఆయన పేర్కొన్నారు. అయితే ఉలేమా, ఇస్లామిక్ పండితులు.. 1857లో బ్రిటిష్ వ్యతిరేక మొదటి స్వాతంత్య్ర యుద్ధంలో ముందంజలో ఉన్నారు. 

Nasratul Abrar shows A fatwa by Ulema in favour of Hindu Muslim unity in British India
Author
First Published Mar 2, 2023, 12:15 PM IST

భారతదేశంలో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం విఫలమైన తర్వాత భారతీయులను తిరిగి సమూహపరచడం, ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటీష్ విధేయులు బెదిరింపులకు గురవుతున్నట్లు భావించినప్పుడు భారత జాతీయవాదులు కాంగ్రెస్‌లో ఆశాకిరణాన్ని చూశారు. అయితే బ్రిటీష్ పాలనకు మద్దతుగా ఉన్న న్యాయవాదులలో ఒకరైన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సరిహద్దును తెరిచారు. అతను 1888లో మీరట్‌లో ఇస్లాం మత భాషతో కూడిన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సర్ సయ్యద్ హిందువులు, ముస్లింలు వేర్వేరు ప్రయోజనాలతో రెండు వేర్వేరు క్వామ్‌లు (దేశాలు/సమాజాలు) అని పేర్కొన్నారు. క్రైస్తవులు ముస్లింలకు సహజ మిత్రులని.. హిందువులు శత్రువులని ఆయన పేర్కొన్నారు. 800 మందికి పైగా ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఎవరితో ఐక్యం కాగలమో ఆ దేశంతో మనం ఏకం కావాలి. ఆంగ్లేయులు ‘పీపుల్ ఆఫ్ ద బుక్’ కాదని మహమ్మదీయులు ఎవరూ అనలేరు. క్రైస్తవులు తప్ప ఇతర మతాల వారు మహమ్మదీయులకు స్నేహితులుగా ఉండరని దేవుడు చెప్పాడని.. ఏ మహమ్మదీయులు దీనిని కాదనలేరు’’ అని పేర్కొన్నారు. ముస్లింలు హిందువులతో కాకుండా బ్రిటిష్ వారితో వ్యాపార సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. హిందూ సభ్యుల కారణంగా కాంగ్రెస్‌ను బహిష్కరించాలని సర్ సయ్యద్ ముస్లింలను కోరారు.

అయితే ఉలేమా, ఇస్లామిక్ పండితులు.. 1857లో బ్రిటిష్ వ్యతిరేక మొదటి స్వాతంత్య్ర యుద్ధంలో ముందంజలో ఉన్నారు. వారు భారతదేశాన్ని విముక్తి చేయడానికి హిందూ రాజులు, జమీందార్లు, అధిపతులతో కలిసి పనిచేశారు. ఈ సహకారం వారు బోధించే ఇస్లాం బ్రాండ్‌తో సమకాలీకరించబడింది.

ఇక, లూథియానా నుంచి ముగ్గురు ఉలేమాలు: మౌలానా ముహమ్మద్ లుధియాన్వీ, మౌలానా అబ్దుల్లా లుధియాన్వీ, మౌలానా అబ్దుల్ అజీజ్ లుధియాన్వీ.. హిందువులు, కాంగ్రెస్‌లను బహిష్కరించాలని సర్ సయ్యద్ చేసిన పిలుపుకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. అయితే సర్ సయ్యద్ ప్రేరణతో బొంబాయి (ప్రస్తుతం ముంబై)లోని ముస్లిం నివాసి అలీ ముహమ్మద్.. హిందువులతో వాణిజ్యం, ఇతర కార్యకలాపాలలో పాల్గొనడానికి అనుమతి ఉందా? అని అడిగారు. ‘‘హిందూ’’ కాంగ్రెస్‌లో కాకుండా సర్ సయ్యద్ స్థాపించిన సంఘంలో ముస్లింలు చేరాలా? అని కూడా ఆయన ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు.. మౌలానా అబ్దుల్ అజీజ్ తన సోదరుడు మౌలానా ముహమ్మద్ లుధియాన్వీ ద్వారా ఫత్వా రూపంలో డాక్యుమెంట్ చేయబడిన ఒక ఉపన్యాసం చేస్తున్నప్పుడు సమాధానమిచ్చారు. ముస్లింలు, హిందూవులు 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని గమనించాలని పేర్కొన్నారు. ‘‘ప్రాపంచిక వ్యవహారాలలో క్రైస్తవులు, యూదులు, హిందువులతో సంబంధాలు కలిగి ఉండటం పూర్తిగా సరైందే’’ అని ఫత్వా నిర్ద్వందంగా పేర్కొంది. ప్రవక్త ముహమ్మద్, ఆయన సహచరులు యూదులతో వ్యాపార సంబంధాలను కొనసాగించారని నిరూపించడానికి ఇస్లామిక్ గ్రంథాలను ఉటంకించారు. ముస్లిమేతరులతో స్నేహం చేయవద్దని ఖురాన్ ముస్లింలను నిర్దేశిస్తోందని సర్ సయ్యద్ చేసిన వాదనను కూడా ఫత్వా ప్రస్తావించింది.

‘‘ఇస్లాం, ముస్లింలను బాధపెట్టే ముస్లిమేతరులతో స్నేహం చట్టవిరుద్ధం అని ఖురాన్‌లోని ఈ ప్రత్యేక వాక్యం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ముస్లింలను చంపడానికి లేదా హాని చేయడానికి ప్రయత్నిస్తున్న హిందువులను మాత్రమే బహిష్కరించవచ్చు. లేకపోతే ముస్లింలు హిందువులతో సంబంధాలు కొనసాగించాలని చెప్పబడింది’’ అని మౌలౌనా పేర్కొన్నారు.

ముస్లింలు కాంగ్రెస్‌లో చేరడం మంచిదని.. దానిని బహిష్కరించాలని సర్ సయ్యద్ చేసిన పిలుపు నిరాధారమని ఫత్వా పేర్కొంది. బదులుగా సర్ సయ్యద్ సంఘంలో చేరవద్దని మౌలానా ప్రజలను కోరారు. ముస్లింలు సర్ సయ్యద్, అతని అనుచరులతో ప్రాపంచిక వ్యవహారాలలో భాగం కాకూడదని పేర్కొన్నారు. వారు ఇస్లాంకు వాస్తవం కానందున ఆయనతో, ఆయన అనుచరులతో వ్యాపారం లేదా వివాహ సంబంధాలు కలిగి ఉండకూడదని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సర్ సయ్యద్ చేసిన బహిష్కరణ పిలుపు ‌ఆయనకు, ఆయన సహచరులకు వర్తిస్తుందని మౌలానా అన్నారు.

ఈ ఫత్వాపై ఉద్ఘాటన లేదా స్పష్టత కోసం లూథియానాకు చెందిన ఉలేమా భారతదేశం, విదేశాలలో ఉన్న వందలాది ఉలేమాలకు లేఖలు రాశారు. ఆ సమయంలో అత్యంత గౌరవనీయులైన ఇస్లామిక్ పండితులు కొందరు ఫత్వాకు తమ అంగీకారాన్ని తెలిపారు. వీరిలో మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, మౌలానా అహ్మద్ రజా ఖాన్ బరేల్వి, మౌలానా మహమూద్ హసన్ దేవబందిలతో పాటు రౌజా అల్-నబీ సల్లల్లాహు అలైహై వసల్లం (ప్రవక్త యొక్క పవిత్ర గది, మదీనా), రౌజా అబ్దుల్ ఖాదిర్ జిలానీ (బాగ్దాద్) పరిచారకులు ఉన్నారు.

రషీద్ అహ్మద్ గంగోహి 1857 బ్రిటీష్ వ్యతిరేక పోరులో పాల్గొన్నారు. దారుల్ ఉలూమ్, డియోబంద్ వ్యవస్థాపకులలో ఒకరు. హిందువులతో ముస్లింలు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం పూర్తిగా అనుమతించదగినదని అన్నారు. సర్ సయ్యద్ నిజంగా ముస్లిం సమాజానికి మంచిని కోరుకున్నప్పటికీ.. అతనికి మద్దతు ఇవ్వకూడదు, బహిష్కరించబడాలనేది ఆయన దృష్టిగా కనిపించింది. 

అహ్మద్ రజా ఖాన్ బరేల్వి మాట్లాడుతూ.. ‘‘వారు (హిందువులు) కాఫిర్-ఇ-హర్బీ అని పిలవలేరు’’ అని పేర్కొన్నారు. ఇస్లామిక్ పాలనలో హిందువులు, ముస్లింలు ఒకే విధమైన హక్కులను అనుభవిస్తున్నారని ఆయన రాశారు. ముస్లింలు హిందువులతో సంబంధాలను కొనసాగించాలని బరేల్వి విశ్వసించారని.. ఇది మొత్తం దేశానికి ప్రయోజనకరమైనది అని పేర్కొన్నారు. 

మౌలానా ముహమ్మద్ లుధియాన్వీ, మౌలానా అబ్దుల్ అజీజ్ లుధియాన్వీలు.. అసలు ఫత్వాకు ఈ ఆమోదాలన్నీ ఫత్వాలుగా వారి నస్రతుల్ అబ్రార్ అనే పుస్తకంలో సంకలనం చేశారు. ఉలేమా కాంగ్రెస్‌కు అనుకూలంగానూ, సర్ సయ్యద్‌ అసోసియేషన్‌కు వ్యతిరేకంగానూ తీర్పు ఇచ్చినప్పటికీ.. వారు కాంగ్రెస్‌లో చేరలేదు. పూర్తి స్వేచ్ఛపై వారికి ఉన్న విశ్వాసం.. కాంగ్రెస్‌ వైఖరి కాకపోవడమే ఇందుకు కారణం. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ పార్టీ పూర్తి స్వేచ్ఛను కోరింది.

ఈ పుస్తకం ఇస్లామిక్ స్కాలర్‌షిప్‌కు ప్రతిబింబం.. ఇది రాజకీయ ఉపయోగం కోసం ఇస్లామిక్ పదజాలాన్ని ఉపయోగించడాన్ని (ఏదైతే సర్ సయ్యద్ చేశాడో) ఖండించింది. ఇస్లామిక్ బోధనలు హిందూ-ముస్లిం ఐక్యత, ఐక్య దేశంతో ఏకీభవిస్తున్నాయని ఇది మరింత రుజువు చేస్తుంది. ముస్లింలు తమ రాజకీయ గ్రూపులను కలిగి ఉండాలని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న పిలుపుకు ఇస్లామిక్ ప్రాతిపదిక లేదని.. లేకపోతే వందలాది ఉలేమాలు ముస్లింల కోసం కాంగ్రెస్ యొక్క హిందూ నాయకత్వాన్ని ఆమోదించరని కూడా ఫత్వా ఎత్తి చూపింది.

Follow Us:
Download App:
  • android
  • ios