ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా.. అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి.. ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి 'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు' ను ప్రదానం చేశారు.
సినీ నటి, ఎంపీ సుమలతకు అరుదైన ఘనత దక్కింది. అమెరికాలోని ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన తొలి తెలుగు మహిళా సంఘం(WETA) ఆధ్వర్యంలో సుమలతకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు అమెరికాలో ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాంటి సంఘం లేదు. కాగా... తాజాగా హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఉమన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)సంఘాన్ని ఏర్పాటు చేశారు.
మహిళా సాధికారత దిశగా అడుగులు వేసే క్రమంలో స్వశక్తి దిశగా మహిళలను ముందుకు నడిపించాలి.. ఈ నినాదంతోనే వెటా రంగంలోకి దిగింది. ప్రస్తుతం అమెరికాలో మన తెలుగోళ్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రముఖ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. మహిళలకు అండాదండగా నిలిచేలా వెటాను తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు ఝాన్సీ రెడ్డి. ఈ సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29వ తేదీన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా.. అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి.. ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి 'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు' ను ప్రదానం చేశారు.
అనంతరం మహిళలంతా కలిసి బతుకమ్మ సంబరాలను కూడా నిర్వహించారు. అందరూ సంప్రదాయ వస్త్రాల్లో ముస్తాబై... రంగురంగుల పూలతో బతకమ్మలను పేర్చి.. సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో WETA సభ్యులు సుగుణా రెడ్డి, స్నేహ వేదుల, శైలజ కల్లూరి, హైమా అనుమందల, అనురాధా అలిశెట్టి, రేఖ లీగల, పద్మిణి కచ్చపి, అభితేజ కొండ, జయశ్రీ తేలుకుంట్ల, సాధన శీలం తదితరులు పాల్గొన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 1, 2019, 1:16 PM IST