బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన భర్తపై అమెరికాకు చెందిన అతని భార్య వరకట్నం వేధింపులు చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. బసవనగుడికి చెందిన మహిలా పోలీసులు మీడియాకు అందుకు సంబంధించిన వివరాలు అందించారు. 

దక్షిణ అమెరికాలోని చిలీకి చెందిన యువతి 2017లో భరతనాట్యం, కథక్ నేర్చుకునేందుకు బెంగళూరుకు వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదుకు చెందిన విక్రమ్ మాడాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2018లో హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరు వివాహం చేసుకున్నారు. 

ఆ తర్వాత వాళ్లు జెపి నగర్ పుట్టెనహళ్లిలో నివాసం ఉంటూ వచ్చారు. 2019లో దంపతులు చిలీకి వెళ్లారు అక్కడ తన కుటుంబ సభ్యుల ఆస్తులతో పాటు సౌకర్యాలను చూసిన తర్వాత డబ్బు కోసం భర్త వేధింపులు ప్రారంభించినట్లు మహిళ ఫిర్యాదులో తెలిపింది. 

తన ఫోన్ రికార్డును పరిశీలించడంతో పాటు తనను మానసికంగా తన భర్త గురి చేశాడని ఆమె ఫిర్యాదులో చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.