ఇక ఆసియా అమెరికన్లకు రక్షణ: దాడుల నిరోధ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
ఇటీవలి కాలంలో అమెరికాలో ఆసియా సంతతి వారిపై దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో ఆసియా సంతతి వారిపై దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
మార్చి 16న అట్లాంటాలోని మసాజ్ పార్లర్లలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ప్రభుత్వం ఆసియా సంతతి వారిపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఆసియన్ అమెరికన్లపై దాడులను నిరోధించేందుకు ఓ బిల్లును రూపొందించింది.
గురువారం సెనేట్ లో ఆ బిల్లును ప్రవేశపెట్టగా పార్టీలకు అతీతంగా రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లంతా దానికి ఆమోదం తెలిపారు. 94–1 ఓట్ల తేడాతో ఆ బిల్లు ఆమోదం పొందింది. అధ్యక్షుడు బైడెన్ సంతకంతో ఆ బిల్లు వచ్చే నెలలో చట్టంగా మారుతుందని సమాచారం.
ఈ చట్టం ప్రకారం విద్వేష ఘటనలపై న్యాయ శాఖ స్వతంత్ర విచారణ జరపనుంది. ఘటన జరిగిన వెంటనే అటార్నీ జనరల్.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశకులుగా ఉంటారు. చట్టం అమలు, ఆన్ లైన్ లో నేరాల రిపోర్టింగ్, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
కాగా, 2019 నుంచి 2020 మధ్య అమెరికాలోని 16 పెద్ద నగరాల్లో ఆసియా సంతతి ప్రజలపై విద్వేష ఘటనలు 149 శాతం పెరిగినట్టు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నివేదిక చెబుతోంది. దీనిని బట్టి అక్కడి స్థానికుల్లో విద్వేషం ఏ మేరకు వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కొత్త చట్టంతోనైనా ఆసియన్ అమెరికన్లకు రక్షణ లభించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.