అమెరికాలో భారీ స్కామ్.. ఇండియన్ స్టూడెంట్ కి ఐదేళ్ల జైలుశిక్ష
అమెరికాలో భారీ స్కామ్ కి పాల్పడినందుకు గాను.. అక్కడి న్యాయస్థానం ఇండియన్ స్టూడెంట్ కి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. టెలిమార్కెటింగ్ స్కామ్ కి పాల్పడ్డారనే ఆరోపణలతో బిశ్వజీత్ కుమార్ ఝూ(21) అనే ఇండియన్ స్టూడెంట్ కి శిక్ష విధించారు.

పెన్షనర్లను టార్గెట్ చేసుకొని ఈ స్కామ్ కి పాల్పడ్డారు. కాగా... ఈ స్కామ్ దాదాపు డజన్ మంది వృద్ధులు దాదాపు 9,37,280 డాలర్లు( 6.5కోట్ల రూపాయలు) పోగొట్టుకున్నారు. అమెరికాకు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ జస్టిస్ ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది.
ఈ స్కామ్‌లో భాగంగా... ఓ బూటకపు సంస్థ నుంచి పెన్షనర్లకు ఫోన్ వస్తుంది. మా సంస్థనుంచి పోరపాటున మీ ఎకౌంట్‌లో సోమ్ము ట్రాన్సఫర్ అయిందంటూ ఆ సంస్థ ప్రతినిధి నమ్మబలుకుతాడు. ఇది నిజమని నమ్మిన కొంత మంది...తమ ఎకౌంట్‌లోంచి కంపెనీ ప్రతినిధి చెప్పిన ఎకౌంట్‌లోకి...అడిగిన మొత్తాన్ని ట్రాన్సఫర్ చేసి చేతులు కాల్చుకున్నారు.
దాదాపు మూడు నెలలపాటు ఈ విధంగా పెన్షనర్లకు ఫోన్లు చేసి.. వారి ఖాతాల్లో నుంచి డబ్బును నిందితులు కాజేశారు. కాగా... బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బిశ్వజీత్ తో పాటు మరికొందరు విద్యార్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఓకే కాలేజీకి చెందినవారుగా గుర్తించారు. ఐదేళ్ల శిక్షాకాలం అనంతరం బిశ్వజీత్ ని తిరిగి భారత్ కి పంపనున్నట్లు అధికారులు చెప్పారు.