Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ కార్డు: ఎన్ఆర్ఐలకు శుభవార్త

  అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు ఉద్యోగం   చేసుకొనేందుకు వలసదారులకు వీలు కల్పించే గ్రీన్ కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది.
 

US House passes bill removing country cap on green cards
Author
USA, First Published Jul 11, 2019, 3:03 PM IST

వాషింగ్టన్ :  అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు ఉద్యోగం   చేసుకొనేందుకు వలసదారులకు వీలు కల్పించే గ్రీన్ కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది.

ఒక్కో  దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వకూడదనే నిబంధనలు ప్రవాస భారతీయులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ కోటా పరిమితిని ఎత్తివేయాలని  కోరుతూ సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 

జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. 

ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హ్యారిస్‌ తన సహచరుడు మైక్‌ లీతో కలిసి సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో 112 మంది కాంగ్రెస్‌ సభ్యుల మద్దతుతో ఇదే తరహా బిల్లును జో లాఫ్గ్రెన్‌, కెన్‌ బక్‌లు ప్రవేశపెట్టారు. గూగుల్ లాంటి సంస్థలు సమర్ధించాయి. 

ఉద్యోగ ఆధారిత (ఈబీ) వీసాల కింద అమెరికా ఏటా 1.4 లక్షల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తోంది. అయితే ఒక్కో దేశం వారికి గరిష్ఠంగా వీటిలో ఏడు శాతానికి మించి కేటాయించకుండా ప్రస్తుత చట్టంలో పరిమితులున్నాయి. జనాభా ఎక్కువున్న దేశాలకూ, తక్కువున్న దేశాలకూ ఈ కోటా ఒకేలా ఉంది. అంటే ఏటా ఈబీ వీసాల కింద ఒక్కో దేశం వారు 9,800కు మించి గ్రీన్‌ కార్డులను పొందలేరు.

Follow Us:
Download App:
  • android
  • ios