న్యూయార్క్: ఇండియన్ టెక్కీలకు మరోసారి  అమెరికా షాకిచ్చింది. హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై  విధించిన తాత్కాలిక రద్దును మరో ఆరు మాసాల పాటు  పొడిగిస్తూ ఆదేశాలు  జారీ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీతో  ఈ గడువు  ముగియనుంది. దీంతో మరో ఐదు మాసాల పాటు హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై విధించిన తాత్కాలిక రద్దును  పొడిగించింది. ఈ రద్దును  2019  ఫిబ్రవరి 19వ తేదీ వరకు పొడిగిస్గున్నట్టు  అమెరికా ప్రకటించింది.

వీసా ధరఖాస్తులను వేగంగా పరిశీలించే  వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా వీసా క్లియరెన్స్‌కు  ఆరు నెలల సమయం పడుతోంది.  కానీ, ప్రీమియ ప్రాసెసింగ్ ద్వారా  15 రోజుల్లోనే దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది.  తద్వారా టెక్కీలకు ప్రయోజనం ఉంటుంది.

ఆయా సాఫ్ట్‌వేర్ కంపెనీలు  తమకు నచ్చిన టెక్కీలను  వీసాలు లేకుండానే విధుల్లోకి తీసుకొనే అవకాశం  ఉంటుంది. అమెరికాలో ఉన్న ఇండియన్ కంపెనీలు ఎక్కువగా  ప్రీమియం ప్రాసెసింగ్ మార్గాన్ని ఎంచుకొంటున్నాయి.అయితే  దీనికి  అదనంగా  రూ.86,181 చెల్లించాలి.