అమెరికాలో కరీంనగర్ వాసికి జైలు: టీఆర్ఎస్ మాజీ మంత్రితో దందాలు
రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ రెడ్డి, అతని భార్య అరుణ గుడిపాటి పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: మనీ లాండరింగ్ కేసులో తెలంగాణలోని కరీంగనర్ కు చెందిన ఓ వ్యక్తికి అమెరికాలో జైలు శిక్ష పడింది. నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాలో స్థిరపడిన గుడిపాటి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్ మాఫియా మనీని సర్క్యులేట్ చేశాడనే ఆరోపణలపై ఆ శిక్ష పడింది.
టెక్సాస్ లోని లారెడో ఫెడరల్ జ్యూరీ అతన్ని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది. మిలియన్ల డాలర్ల కొద్దీ మనీ లాండరింగ్ కుంభకోణంలో అతనితో పాటు ఐదుగురికి కోర్టు శిక్ష విధించింది. అమెరికాలో డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును లారెడోలోని వ్యాపారాల ద్వారా మెక్సికో డ్రగ్ డీలర్లకు చేరవేసినట్లు వారు ఆరోపణలు ఎదుర్కున్నారు.
రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ రెడ్డి, అతని భార్య అరుణ గుడిపాటి పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
న్యూజెర్సీలోని న్యూట్లీలో ఉంటున్న ఆ కుటుంబం హైదరాబాదులో కూడా పెట్టుబడులు పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. స్కీంలో నిర్వహించిన పాత్రకు శిక్ష పడిన ఆరుగురిలో రవీందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్లు ఉన్నారు.
శిక్ష పడినవారిలో రవీందర్ రెడ్డి (61), హర్ష్ జగ్గి (54), నీరు జగ్గి (51) ఉన్నారు. వీరంతా టెక్సాస్ లోని లారెడోకు చెందినవారు. ఈ ముగ్గురితో పాటు అడ్రైన్ అర్సీనేగా హెర్నాండెజ్ (36), అడ్రైనా అలెజాండ్రా గల్వావన్ - కాన్సంటిని, లూయిస్ మోంటెస్ -పాటినో లకు శిక్ష పడింది.
ఎన్ వైఎస్ఎ ఇంపెక్స్ ఎల్ఎల్ సీ పేరుతో చైన్ పెర్ఫ్యూమ్ స్టోర్స్ ఉన్న రవీందర్ రెడ్డి, ఎల్ రీనో ఇంటర్నేషనల్ ఇన్ కార్పోరేషన్ యజమానులు హర్ష్, నీరు జగ్గిలు డ్రగ్ మనీ అని తెలిసి పెద్ద యెత్తున నగదు తీసుకున్ారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.