Asianet News TeluguAsianet News Telugu

గాంధీజీకి గోల్డ్ మెడల్‌ ఇవ్వనున్న అమెరికా..!!

భారత జాతిపిత మహాత్మా గాంధీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించాలని అమెరికా భావిస్తోంది. గాంధీజీని గోల్డ్ మెడల్‌తో సన్మానించాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు నిర్ణయించారు. 

United states congress plans to honour gandhiji with gold medal
Author
United States, First Published Oct 2, 2018, 12:21 PM IST

భారత జాతిపిత మహాత్మా గాంధీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించాలని అమెరికా భావిస్తోంది. గాంధీజీని గోల్డ్ మెడల్‌తో సన్మానించాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు నిర్ణయించారు.

ఆ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావ వంతమైన కొందరు రాజకీయ నేతలు.. దీని కోసం అమెరికా చట్టసభలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఈ బృందంలో భాతర సంతతి సభ్యులు.. అమీ బిరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమిలా జయపాల్‌లు ఉన్నారు.

హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని కరోలిన్ మలోనే అనే చట్టసభ సభ్యుడు సెప్టెంబర్ 23న ఈ ప్రతిపాదన చేశారు. శాంతి, అహింస, సమానత్వం కోసం బాపూజీ ఎంతో కృషి చేశారని తీర్మానంలో పేర్కొన్నారు.

అమెరికాలోని చట్టసభలు...దేశ అత్యున్నత పౌర పురస్కారం కింద గోల్డ్ మెడల్‌ను ఇస్తాయి.. ఇప్పటి వరకు మదర్ థెరిస్సా, నెల్సన్ మండేలా, పోప్ జాన్ పాల్-2, దలైలామా, ఆంగ్ సాన్ సూకీ, మొహమ్మద్ యూనిస్, షిమోన్ పీరస్‌లు మాత్రమే గోల్డ్ మెడల్ అందుకున్న విదేశీయులు.

Follow Us:
Download App:
  • android
  • ios