ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. దుబాయ్ లో నిర్వహించే మహజూజ్ మిలియనీర్ డ్రాలో తాజాగా హైదరాబాద్ కు చెందిన మీర్ అనే వ్యక్తి ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వన్ మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ.2 కోట్లు) గెలుచుకున్నాడు. 

దుబాయ్ : యేళ్ల తరబడి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడో గానీ అదృష్టం కలిసిరాదు. కానీ, ఈ హైదరాబాదీ విషయంలో మాత్రం అలా జరగలేదు. లాటరీ డ్రా (Mahzooz millionaire)కు కొన్ని గంటల ముందు కొన్న ఓ వాటర్ బాటిల్ (Water Bottle)అతడి జీవితాన్నే మార్చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. దుబాయ్ లో నిర్వహించే మహజూజ్ మిలియనీర్ డ్రాలో తాజాగా హైదరాబాద్ కు చెందిన మీర్ అనే వ్యక్తి ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వన్ మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ.2 కోట్లు) గెలుచుకున్నాడు. 

దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ డ్రా నిర్వహించేందుకు ఐదు గంటల ముందు తాను కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ తనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని తెలిపాడు. ఇలా వాటర్ బాటిల్ కొనడం ద్వారా తాను మహజూజ్ లాటరీలో భాగమయ్యానని, అది కాస్తా తన జీవితంలో చూడనన్ని నగదును తెచ్చిపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నాడు.