ఆస్ట్రేలియాలో ఇద్దరు భారతీయులు మృతి.. వరద బీభత్సంలో చిక్కుకుని విషాదం..

ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కకుని ఇద్దరు భారతీయ సంతతికి చెందిన తల్లీ కొడుకులు మృత్యువాత పడ్డారు. 

two indians died due to floods in australia

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన తల్లి కొడుకులు మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు 
Australiaలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున Floods సంభవించాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన హేమలతాసోల్హైర్ సత్చితానందం,  ఆమె 34 ఏళ్ల కుమారుడు సోమవారం కారుతో సహా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. dead bodyలను కూపర్స్ క్రీక్ కెనాల్‌లో న్యూసౌత్ వేల్స్‌  పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత  మృతదేహాలను Postmortem నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లి కొడుకుల మృతి పై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 9న కొలంబియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కొలంబియాలోని పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో మంగళవారం ఉందయం కొండచరియలు విరిగిపడటంతో.. బురద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి కనీసం 14 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్టుగా చెప్పారు. ఒకరి ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు  వెల్లడించారు. మరికొందరి కోసం రెస్క్యూ బృందాలు బురదలో వెతుకుతున్నాయని కొలంబియా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

మృతుల సంఖ్యను పెరీరా మేయర్ కార్లోస్ మాయా ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా పొంచి ఉందని వెల్లడించారు. మరింతగా ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రజలు కొండచరియలు అవకాశం ఉన్న ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. ఇంకా రంగంలోకి దిగిన ప్రభుత్వ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో చెక్కతో నిర్మించిబడిన అనేక ఇళ్లు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. 

అంతేకాకుండా ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను ఆ బృందాలు గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే 60 కంటే ఎక్కువ ఇళ్లలో నివసించే వారిని ఖాళీ చేయించారు. భారీ వర్షాల కారణంగాల బురద నీటిలో కురుకుపోయిన మరణించిన వారి కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

కొండచరియలు విరిగిపడిన సమయంలో చాలా పెద్ద శబ్ధం వచ్చిందని.. తాము భయాందోళన చెందామని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ తెలిపారు. తాము బయటకు వెళ్లి చూస్తే కొండ కొంత భాగం ఇళ్లపై పడటం కనిపించిందని చెప్పారు.  

ఇక, కొలంబియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. దేశంలో వర్షాకాలంలో నిటారుగా ఉండే కొండలపై నిర్మించబడిన ఇళ్లు ప్రమాదానికి గురవుతున్నాయి. 2019లో నైరుతి Cauca provinceలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 28 మంది చనిపోయారు. అంతకు రెండేళ్ల ముందు దక్షిణ పుటుమాయో ప్రావిన్స్‌లోని మోకోవా పట్టణంలో కొండచరియలు విరిగిపడడంతో 250 మందికి పైగా మరణించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios