సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ బాలురు మృతి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అసన్ రియాజ్ (14), ఇబ్రహీం అజార్ (12) ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్ధి అమ్మర్ అజారికి తీవ్రగాయాలయ్యాయి.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. దమ్మంలో కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన అసన్ రియాజ్ (14), ఇబ్రహీం అజార్ (12) ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్ధి అమ్మర్ అజారికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా దుబాయ్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. విద్యార్ధుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.